జయరాజ్​కు కాళోజీ నారాయణరావు అవార్డు

జయరాజ్​కు కాళోజీ నారాయణరావు అవార్డు

కవి, రచయిత, గాయకుడు జయరాజ్​కు కాళోజీ నారాయణ రావు అవార్డు ప్రకటించారు. ఈ నెల 9న కాళోజీ జయంతి సందర్భంగా అవార్డు, 1,01,116 నగదు అందజేయనున్నారు.

హైదరాబాద్, వెలుగు :  ప్రముఖ కవి, రచయిత, గాయకుడు జయరాజ్​కు కాళోజీ నారాయణరావు అవార్డు-2023 ప్రకటించారు. సాహిత్య సాంస్కృతిక రంగాల్లో కృషి చేస్తున్న వారికి యేటా కాళోజీ అవార్డులు అందజేస్తున్నారు. ఈ నెల 9న కాళోజీ జయంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో జయరాజ్​కు అవార్డుతో పాటు రూ.1,01,116 నగదు అందజేయనున్నారు. మహబూబాబాద్​ జిల్లాకు చెందిన జయరాజ్​ పేద దళిత కుటుంబంలో పుట్టారు.

చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలను అధిగమించిన ఆయన వివక్ష లేని సమాజం కోసం సాహిత్య రచన కొనసాగిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఊరూరా తిరుగుతూ తన ఆటపాటలతో ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను రగల్చడానికి కృషి చేశారు. తెలంగాణ సాహిత్యానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డుకు ఎంపిక చేశారు.