కాళోజీ వర్సిటీ మెడికల్ పీజీ రెండో విడత అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ

కాళోజీ వర్సిటీ మెడికల్ పీజీ రెండో విడత అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ

వరంగల్ జిల్లా : మెడికల్ పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం రెండో విడత నోటిఫికేషన్ జారీ చేసింది. యూనివర్సిటీ పరిధిలోని మెడికల్ కాలేజీల్లో పీజీ కన్వీనర్ కోటా సీట్లకు  ఈ నెల 5, 6 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని యూనివర్సిటీ అధికారులు ఓ ప్రకటనలో కోరారు.

అర్హులైన అభ్యర్థులు ఈనెల 5న ఉదయం 8 గంటల నుంచి 6వ తేదీ వరకు ప్రాధాన్యతా క్రమంలో కాలేజీల వారీగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. కాలేజీల వారీగా ఖాళీ సీట్ల వివరాలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు కాలేజీల వారీగా వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలన్నారు.   

పూర్తి వివరాలను వర్సిటీ వెబ్ సైట్: www.knrush.telangana.in లో చూడొచ్చు.