కాళోజీ యూనివర్సిటీ వీసీగా రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి

కాళోజీ యూనివర్సిటీ వీసీగా రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి
  •     హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తూ ఉత్తర్వులు జారీ 

హైదరాబాద్, వెలుగు: వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్ అండ్ సైన్సెస్ యూనివర్సిటీ (కేఎన్ఆర్యూహెచ్ఎస్) ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జ్ వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా డాక్టర్ కె.రమేశ్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆయనే ఈ పదవిలో కొనసాగుతారని స్పష్టం చేశారు. 

కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ చట్టం-1986లోని సెక్షన్ 12 ప్రకారం.. గవర్నర్ ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, గత వీసీ నందకుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆ స్థానాన్ని భర్తీ చేయాలని ప్రభుత్వం పలువురి పేర్లను పరిశీలించింది. 

డాక్టర్ రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వర్సిటీ వీసీగా అదనపు బాధ్యతలు ఆయనకు అప్పగించిందని అధికారులు చెబుతున్నారు. డాక్టర్ రమేశ్ రెడ్డి ప్రస్తుతం యాదాద్రి భువనగిరి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేశారు. అలాగే, గాంధీ, నీలోఫర్ తదితర అనేక హస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు.