ట్రేడింగ్లో పెట్టుబడి అంటూ..రూ.29.50 లక్షలు కొట్టేశారు

ట్రేడింగ్లో పెట్టుబడి  అంటూ..రూ.29.50 లక్షలు కొట్టేశారు

బషీర్​బాగ్​, వెలుగు: ట్రేడింగ్ ఇన్వెస్ట్​మెంట్ పేరుతో ఓ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగిని స్కామర్లు బురిడీ కొట్టించారు. నల్లకుంట ప్రాంతానికి చెందిన 63 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగికి స్కామర్స్ దివ్య మెహ్రా అనే మహిళ పేరుతో సంప్రదించారు. ఇండియా నివేష్ షేర్స్ అండ్​ సెక్యూరిటీస్ లిమిటెడ్ కంపెనీగా పరిచయం చేసుకున్నారు.

 బాధితుడి నంబర్ ను ‘163 గేట్ వే టు ది ఫ్యూచర్’ అనే వాట్సాప్ ట్రేడింగ్ గ్రూప్ లో యాడ్ చేశారు. అధిక లాభాలు వస్తున్నట్లు అందులో ఫేక్ స్క్రీన్ షాట్స్ పంచుకున్నారు. ఐపీవోలో ఇన్వెస్ట్ చేయాలని ఒత్తిడి చేయడంతో బాధిత వృద్ధుడు ఆయనతో పాటు భార్య ఖాతా నుంచి ఇన్వెస్ట్​ చేశాడు. రూ.29 లక్షల 50 వేలు పోగొట్టుకున్నాడు. సైబర్ క్రైం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.