బీటీఎఫ్ స్టేట్ కమిటీ అధ్యక్షుడిగా చైతన్య

బీటీఎఫ్ స్టేట్ కమిటీ అధ్యక్షుడిగా చైతన్య

హైదరాబాద్, వెలుగు: బహుజన్ టీచర్స్ ఫెడరేషన్ (బీటీఎఫ్) రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నికైంది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా రంగారెడ్డి జిల్లాకు చెందిన కల్పదర్శి చైతన్య, ప్రధాన కార్యదర్శిగా నిజామాబాద్ జిల్లాకు చెందిన మేఘవత్ సంతోష్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం హైదరాబాద్‌‌లోని మింట్ కాంపౌండ్‌‌లోని స్ఫూర్తి భవన్‌‌లో  సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొత్త కమిటీని ఎన్నుకున్నారు.  

గౌరవ అధ్యక్షుడిగా మార్వాడి గంగరాజు, కోశాధికారిగా కాడం బాలశంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్‌‌గా చెన్నయ్య, అదనపు ప్రధాన కార్యదర్శిగా నాగరాజు, అసోసియేట్ ప్రెసిడెంట్లుగా సిద్ధార్థ, సాగర్, ఎండీ గౌస్.. ఉపాధ్యక్షులుగా చంద్రకళ, సువార్తమ్మ, ఖలీల్ పాషా,  శంకర్, శ్రీనివాసులు, బాలస్వామి,  శ్రీశైలం, భిక్షపతి నాయక్ ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రటరీలుగా  విజయ్ కుమార్, ప్రభాకర్, సాంభ్య నాయక్.. కార్యదర్శులుగా జె. పవన్ కుమార్, పి. క్రిస్టోఫర్, ఇ. శ్రీదేవి ఎన్నికయ్యారు.