కల్వకుంట్ల కుంటుంబ పాలన అంతం కాబోతోంది

కల్వకుంట్ల కుంటుంబ పాలన అంతం కాబోతోంది

మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్: రాష్ట్రంలో కల్వకుంట్ల కుంటుంబ పాలన అంతం కాబోతోందని మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి జోస్యం చెప్పారు. పేదలకు డబల్ బెడ్రూం ఇళ్లు కట్తిసామని కేసీఆర్ ప్రజలను మోసం చేసినందుకు ఇప్పుడు గుణపాఠం నేర్పుతారని ఆయన పేర్కొన్నారు. మియాపూర్ స్టాలిన్ నగర్ లో పలువురు యువకులు మాజీ ఎంపీ ..బీజేపీ నేత వివేక్ వెంకట స్వామి ఆధ్వర్యంలో బీజేపీ లో చేరారు. ఉత్సాహంగా పనిచేసేందుకు వచ్చిన యువకులకు ఆయన కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల్లో  బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు డబుల్ బెడ్రూం లు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పి ఊరించిన కేసీఆర్ తన కుంటుంబ సభ్యులకు మాత్రం ఫామ్ హౌస్ లు కట్టిస్తున్నాడని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇవ్వాల్సిన వరద బాధితుల సహాయాన్ని  టిఆర్ఎస్ నాయకులే పంచుకున్నారని ఆయన ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించగానే వరద బాధితులకు 25 వేల రూపాయలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మియాపూర్ 108 వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి రాఘవేంద్ర రావ్ ను భారీ మెజార్టీ తో గెలిపించాలని వివేక్ వెంకటస్వామి కోరారు.

FOR MORE NEWS…

టీఆర్ఎస్ ఫేక్ న్యూస్ ప్రచారానికి దిగడం.. ఓటమిని ఒప్పుకున్నట్లే

V6 న్యూస్ ఛానెల్ పై దుష్ప్రచారం.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు 

ఇకపై ఆయుర్వేద డాక్టర్లూ ఆపరేషన్లు చేయొచ్చు

జీరో బడ్జెట్ రాజకీయాలు చేసే దమ్ముందా..?

వీడియో: మహిళలను వేధిస్తున్న ఆకతాయిలతో రోడ్డు మీదే..

జీహెచ్ఎంసీ ఎన్నికలు: చిన్న వయసులోనే నామినేషన్

జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ కేటీఆర్‌ని కలిసిన యాంకర్ సుమ

చేతిలో రూపాయి లేకుండా కార్పొరేటర్ బరిలోకి

ప్రచారానికి పోతే రూ.1000, బిర్యానీ ప్యాకెట్