కల్వకుంట్ల వారికి రాజకీయ సమాధి చేసే తీర్పు ఇవ్వాలి

కల్వకుంట్ల వారికి రాజకీయ సమాధి చేసే తీర్పు ఇవ్వాలి
  • మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ

వరంగల్ అర్బన్: కల్వకుంట్ల వారికి రాజకీయ సమాధి చేసేలా హుజూరాబాద్ ప్రజలు తీర్పు ఇవ్వాలని బీజేపీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ పిలుపునిచ్చారు. ఈటల రాజేందర్ తో కలసి ఆమె పాదయాత్రలో పాల్గొన్నారు. నేరెళ్ల గ్రామంలో బొడిగె శోభ మాట్లాడుతూ నేను నేరెళ్ల మనుమరాలినని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ను అరెస్ట్ చేస్తుంటే అడ్డం పడ్డది రాజేందర్ అన్న, తానేనని చెప్పారు. ఆనాడు  నీదగ్గర   ఎర్రబెల్లి, గంగుల, ధర్మారెడ్డి ఉన్నారా? అని ఆమె ప్రశ్నించారు.  ఎందుకు నీతి తక్కువ పనులు చేస్తున్నావ్ కేసీఆర్ ? అని ఆమె నిలదీశారు. నీవెంట ఉన్న వాళ్లంతా లంగలు, దొంగలు, వ్యభిచారులు, గుట్కా బుక్కేటోల్లేనని ఆమె విమర్శించారు. నీకు అండగా ఉన్నవారిని బయటికి నెట్టేశాడన్నారు. ఇక్కడ నాయకులు కూడా అమ్ముడు పోయారన్నారు. ముక్కు అరిగేవరకు రాకినా హుజురాబాద్ ప్రజలను నువ్వు కొనలేవని హెచ్చరించారు. త్వరలోనే కల్వకుంట్ల వారందరికీ కటకటాలు తప్పవని.. అన్నింటినీ వడ్డీతో సహా వసూలు చేస్తామని ఆమె హెచ్చరించారు. ఈటల రాజేందర్ ని అసెంబ్లీకి పంపాలని.. ఆయన్ను చూసి కేసీఆర్,  కేటీఆర్ లకు లాగు తడవాలని బొడిగె శోభ కోరారు.