V6 News

కళ్యాణ్ జ్యువెలర్స్ కొత్త షోరూమ్‌ ‌ షురూ

కళ్యాణ్  జ్యువెలర్స్  కొత్త షోరూమ్‌ ‌ షురూ

హైదరాబాద్‌‌, వెలుగు: కళ్యాణ్ జ్యువెలర్స్ హైదరాబాద్‌‌లోని పంజాగుట్ట–బేగంపేట మెయిన్ రోడ్‌‌లో కొత్త షోరూమ్‌‌ను ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవానికి సినీ నటులు నాగార్జున, శ్రీలీల హాజరయ్యారు. ఈ షోరూమ్‌‌లో  ముహూరత్, ముద్ర, నిమా వంటి బ్రాండ్‌‌లతో పాటు వివిధ సిగ్నేచర్ కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. 

నాగార్జున, శ్రీలీల ఈ బ్రాండ్‌‌ నమ్మకం, పారదర్శకతను ప్రశంసించారు.  కస్టమర్ల అవసరాలను  తీర్చే డెస్టినేషన్‌‌ను సృష్టించడమే తమ లక్ష్యమని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కళ్యాణరామన్ అన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా సంస్థ  ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది.

  సాదా బంగారు ఆభరణాలపై గ్రాముకు రూ.750 తగ్గింపు, ప్రీమియం, స్టడెడ్ ఆభరణాలపై రూ.1500 తగ్గింపు, టెంపుల్,  యాంటిక్ ఆభరణాలపై రూ.1000 తగ్గింపును ప్రకటించింది. అన్ని ఆభరణాలు బీఐఎస్‌‌ హాల్‌‌మార్క్‌‌తో, ఫోర్‌‌‌‌ -లెవల్ అష్యూరెన్స్ సర్టిఫికెట్‌‌తో వస్తాయని తెలిపింది.