
‘పేదింట్లో పెండ్లికి కల్యాణలక్ష్మి , షాదీ ముబారక్‌పథకం కింద లక్షా నూట పదహార్లు ఇస్తం ’ అని సీఎంకేసీఆర్ ప్రకటించినా హైదరాబాద్ జిల్లాలో దరఖాస్తులు ఎక్కడివి అక్కడే ఉన్నాయి.ఇప్పటివరకు ఈ రెండు స్కీంల కింద 7వేల అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. ఎన్ని కలు, అధికారుల నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది. నిన్నమొన్నటి దాకా వరుస ఎలక్షన్లతో జిల్లా త్రాంగం హడావుడిగా ఉంది. ప్రస్తుతానికి పథకాలు.. పెండింగ్ పనుల పరిష్కారానికి చర్కలు తీసుకుంటుం ది. వాస్తవానికి హైదరాబాద్ మినహాయిస్తే ఇతర జిల్లాలో స్థానిక ఎలక్షన్ల జోరు కొనసాగుతోం ది. దీనికితోడు ఎలక్షన్ కోడ్ అమలులో ఉండడంతో జిల్లాలో పలు పథకాలు, ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి. అయితే, హైదరాబాద్ జిల్లాకు స్థానిక ఎన్నికలు లేకపోవడంతో పథకాల అమలు, పెండిం గ్ సమస్యలను పరిష్కారించేందుకు కలెక్టర్ మాణికర్ రా జ్ కన్నన్ దృష్టి సారించారు. అయినప్పటికీ జిల్లాలో వివిధ పథకాలు పెండింగ్ లోనే ఉన్నాయి. షాదీముబారక్ , కల్యాణలక్ష్మి పథకాలు ముందుకు సాగడంలేదని తెలిసింది. ఆయా దరఖాస్తుల పరిశీలన విషయంలో కిందిస్థాయి అధికారులు జాప్యం చేస్తుండడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు .
7 వేలకుపైగా పెండింగ్ అప్లికేషన్స్…..
హైదరాబాద్ జిల్లాలో పదహారు మండలాల్లో గతేడాది డిసెంబర్ నెల చివరి నాటికి షాదీముబారక్ కిం ద 10, 223 , కల్యాణలక్ష్మికి 4,665మంది దరఖాస్తు చేసుకున్నారు . ఆ నెల వరకు షాదీముబారక్ కింద 944 మంది, కల్యాణలక్ష్మి కింద 512 మంది అమ్మాయిల దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టారు . ఆ తర్వాత ఎన్నికలుకోడ్ , కింది స్థా యి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇప్పటి వరకు సుమారు గా 7వేలకుపైగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్లు సమా చారం. ఈ పథకాలకు దరఖాస్తు చేసుకునే వారి ధృవీకరణ పత్రాలు అందజేస్తే వాటిని తిరస్కరించకుండా రిటర్న్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఉన్నాతాధికారి ఆదేశాలున్నప్పటికీ ఈ రెండు పథకాల పరిశీలన ప్రక్రియ ముందుకు సాగడం లేదని తెలిసింది. ప్రధానంగా వీఆర్ఓలు తనిఖీ చేసి సక్రమంగా ఉన్నాయో లేదా విచారణ చేపట్టాల్సి ఉంది. ఆపై తహసీల్దా ర్ పరిశీలన చేసి వాటిని ఆర్డీఓలకు పంపించాలి. ఆర్డీఓలు ఆమోదం తెలుపగానే ఫైనాన్సియల్ క్లియరెన్స్ కోసం పంపి లబ్ధిదారులకు సాయాన్ని అందజేయాల్సి ఉంటుంది. మునుపెన్నడూ లేని విధంగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు జిల్లాలోనే అత్యధికంగా ఆప్లికేషన్లు వచ్చాయి. ఎన్నికల కారణంగానే వీటిని పక్కన పెట్టాల్సి వచ్చిందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. పథకాలపైసల కోసం కొన్ని రోజుల పాటు అమ్మాయిల తరుపువాళ్లు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు .ఇందులో ఇప్పటికి చాలామందికి డబ్బు లు అందలేదని కలెక్టరేట్ కు నేటికీ వచ్చిపోతున్నారు