IPL 2025: ఐపీఎల్‌కు వెళ్తామంటే ఆపం.. అంతా మా ప్లేయర్ల ఇష్టం: క్రికెట్ ఆస్ట్రేలియా

IPL 2025: ఐపీఎల్‌కు వెళ్తామంటే ఆపం.. అంతా మా ప్లేయర్ల ఇష్టం: క్రికెట్ ఆస్ట్రేలియా

ఐపీఎల్ 2025 రీ షెడ్యూల్ చేసిన తర్వాత ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆడతారా లేదా అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ సీజన్ లోని మిగిలిన మ్యాచ్ లు ఆడడానికి ఆసీస్ క్రికెటర్లు మొదటగా ఆసక్తి చూపించట్లేదట. దీంతో ఆయా జట్ల ఫ్రాంచైజీలు కంగారు పడ్డారు.   ఇండియా, పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్‌ షెడ్యూల్ ను శనివారం (మే 12) ప్రకటించారు. దీని ప్రకారం శనివారం (మే 16) నుంచి ఐపీఎల్ 2025 లో మిగిలిన మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. అయితే షెడ్యూల్ జూన్ 3 వరకు పొడిగించారు.  

ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు శాతించకముందే ఆస్ట్రేలియా క్రికెటర్లు తమ స్వదేశానికి చేరుకున్నారు. ఐపీఎల్ మరల ప్రారంభం కానుండడంతో వారు తిరిగి వస్తారని బీసీసీఐ భావించింది. ఐపీఎల్‌లో ఆడుతున్న ఆసీస్ జట్టు శనివారం (మే 10) ఇండియా నుంచి విమానాల్లో తమ దేశానికి చేరుకున్నారు. మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్టార్క్ ఆదివారం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టారు. స్టార్క్ మీడియాతో మాట్లాడటానికి నిరాకరించగా.. అందరూ క్షేమంగా ఉన్నారని స్టోయినిస్ అన్నాడు. దీంతో ఆసీస్ క్రికెటర్లు మరల ఇండియాలో అడుగుపెట్టరనే అనుమానము కలిగింది. 

ఆసీస్ క్రికెటర్లు ఇండియాలో అడుగుపెడతారు లేదా అనే విషయంపై క్రికెట్ ఆస్ట్రేలియా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో తమ ప్లేయర్స్ కు పూర్తి స్వఛ్చను ఇచ్చింది. తమ క్రికెటర్లు ఐపీఎల్ ఆడతారా లేదా అనే విషయం వారి వ్యక్తిగతానికి సంబంధించినది అని తెలిపారు. రిపోర్ట్స్ ప్రకారం సన్ రైజర్స్ తరపున ఆడుతున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు కమ్మిన్స్, హెడ్ భారత్ లో అడుగు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం. స్టార్క్, జోష్ హేజాల్ వుడ్ ఆస్ట్రేలియాలోనే ఉంటారట. 

జూన్ 11 న సౌతాఫ్రికాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ షిప్ ఫైనల్ ఉండడంతో ఆస్ట్రేలియా జట్టు భారత్ కు రావడం దాదాపుగా అసాధ్యంగా మారింది. డబ్ల్యూటీసీ ఫైనల్ కు ముందు కమ్మిన్స్ సేనకు రెస్ట్ తో పాటు ప్రాక్టీస్ అవసరం. మరి ఇలాంటి సమయంలో ఆసీస్ కక్రికెటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. దీంతో లీగ్ మ్యాచ్ ల వరకే ఆసీస్ ప్లేయర్స్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025 ప్లేఆఫ్‌ మ్యాచ్ లు మే 29 నుండి ప్రారంభమవుతాయి.  జూన్ 3 న ఫైనల్ జరుగుతుంది.