
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ డెవిల్. ప్రీ ఇండిపెండెన్స్ పీరియాడిక్ అండ్ ఇన్వెస్టిగేటీవ్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాకు అభిషేక్ నామ నిర్మాతగా, దర్శకుడిగా వ్యవహరించారు. ఈ సినిమా డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆడియన్స్ నుండి సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఈ సినిమాకు రివ్యూలు కూడా పాజిటీవ్ గా వచ్చాయి. దీంతో ఆడియన్స్ ఈ సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
అయితే.. డెవిల్ సినిమాకు టాక్ బాగానే వచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం అంతగా రాలేదనే చెప్పాలి. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజు కేవలం రూ.4 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. కళ్యాణ్ రామ్ గత చిత్రాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. బింబిసార సినిమా మొదటిరోజు రూ.11 కోట్లకు పైగా వసూళ్లు సాధించి కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనేనింగ్స్ తెచ్చిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఆతరువాత వచ్చిన అమిగోస్ కూడా మొదటిరోజు డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. కానీ డెవిల్ సినిమాకు మాత్రం మొదటిరోజు దారుణమైన కలెక్షన్స్ వచ్చాయి.
దానికి కారణం డెవిల్ సినిమా దర్శకుడి మార్పు వల్ల ఏర్పడిన వివాదం. ఈ సినిమాకు ముందుగా నవీన్ మేడారం పేరు దర్శకుడిగా వినిపించింది. కానీ నిర్మాతతో ఏర్పడ్డ ఈగోల కారణంగా నవీన్ మేడారంను ఈ సినిమా నుండి తొలగించి చిత్ర నిర్మాత దర్శకుడిగా ఆయన పేరు వేసుకున్నారు. అది కూడా సినిమా రిలీజ్ కు కేవలం కొన్ని రోజుల ముందు. దీంతో సినిమాపై నెగిటీవ్ ఇంపాక్ట్ పడింది. అది సినిమా కలెక్షన్స్ పై పడింది. మరి సినిమాకు ఆడియన్స్ నుండి హిట్ టాక్ వచ్చింది కాబట్టి.. రానున్న రోజుల్లో కలెక్షన్స్ ఏమైనా పెరుగుతాయా అనేది చూడాలి.