
హర్ష చెముడు, దివ్య శ్రీపాద లీడ్ రోల్స్‌లో కళ్యాణ్ సంతోష్ రూపొందిస్తున్న చిత్రం ‘సుందరం మాస్టర్’. హీరో రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మిస్తున్నారు. మంగళవారం టీజర్ లాంచ్ ఈవెంట్‌ను విశాఖపట్నంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ ‘టీజర్ చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. ‘సుందరం’ మాస్టర్‌గా హర్ష అందర్నీ నవ్విస్తాడు. తను ఇంకా మంచి స్థాయికి చేరుకుంటాడని ఆశిస్తున్నా. ఈ చిత్రాన్ని రవితేజ గారు నిర్మించడం గొప్ప విశేషం. ఆయన నాకు కొన్ని విలువైన విషయాలు నేర్పించారు. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ ’ అన్నాడు. హర్ష మాట్లాడుతూ ‘ఇందులో హీరో నేనంటే మొదట నమ్మలేదు. పూర్తి కథ విన్నాక మరెవరికీ చెప్పకు.. ఇది నేనే చేస్తా అన్నా.
పదేళ్ల క్రితం షార్ట్ ఫిల్మ్‌తో స్టార్ట్ అయిన నేను నటుడిగా ఎదిగాను. నాకిది చాలా ఎమోషనల్ మూమెంట్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన రవితేజ గారు.. నాలాంటి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని వారికి సపోర్ట్ అందిస్తున్నారు’ అని చెప్పాడు. ‘టీజర్‌ను మించి ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది’ అని చెప్పింది దివ్య శ్రీపాద. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ చిత్ర దర్శకుడు కళ్యాణ్ థ్యాంక్స్ చెప్పాడు. కార్యక్రమంలో పాల్గొన్న డైరెక్టర్స్ సుధీర్ వర్మ, చందు మొండేటి టీమ్‌కి బెస్ట్ విషెస్ చెప్పారు.