- అనుకూలంగా తీర్పు వస్తుందన్న నమ్మకం ఉంది: మంత్రి పొన్నం
హైదరాబాద్, వెలుగు: పేదలకు ఆర్థిక భరోసా కల్పించే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను ఎట్టి పరిస్థితుల్లో నిలిపివేసే ప్రసక్తే లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ పథకాల కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపిస్తున్నామని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వం తరపున కౌంటర్ దాఖలు చేయకపోవడం వల్ల కోర్టు స్టే విధించిందని, విష యం తమ దృష్టికి వచ్చిన వెంటనే ప్రభుత్వం కౌంటర్‌తో పాటు వెకెట్ పిటిషన్ దాఖలు చేసిందన్నారు.
ఈ అంశంపై కోర్టులో హియరింగ్ కూడా పూర్తయిందని పేర్కొన్నారు. హైకోర్టులో ప్రభుత్వం తరఫున వినిపించిన వాదనలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుని అను కూలమైన తీర్పు వస్తుందనే నమ్మకం ఉందని, ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకా లను కొనసాగించేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.
