ఆరాధనగా అందరికీ గుర్తుండిపోతా

ఆరాధనగా  అందరికీ గుర్తుండిపోతా

డాక్టర్ చదివి యాక్టర్‌‌‌‌గా వరుస సినిమాలు చేస్తోంది కామాక్షి భాస్కర్ల.  ఆమె నటించిన తాజా చిత్రం ‘12ఏ రైల్వే కాలనీ’. అల్లరి నరేష్‌‌ హీరోగా నాని కాసరగడ్డ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అనిల్ విశ్వనాథ్ కథ, స్ర్కీన్‌‌ప్లే, డైలాగ్స్ అందించారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ మూవీ నవంబర్ 21న విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ ‘‘ఇదొక  గ్రిప్పింగ్ థ్రిల్లర్.   సినిమా చూస్తున్నంతసేపు నెక్స్ట్ ఏం జరగబోతుందనే ఎక్సయిట్‌‌మెంట్  ఉంటుంది. తన  పని తాను చేసుకుపోయే క్యారెక్టర్‌‌‌‌లో కనిపిస్తా. 

అలాంటి అమ్మాయి ప్రేమకథ నుంచే థ్రిల్లర్, సస్పెన్స్  బిల్డ్ అవుతాయి. ఆరాధనగా నేను పోషిస్తున్న ఈ పాత్ర  అందరికీ గుర్తుండిపోయేలా ఉంటుంది.  నరేష్ గారితో నటించడం నా కెరీర్‌‌‌‌కు  చాలా మైలేజ్ ఇస్తుంది. ఆయనతో  ఇంతకుముందు  ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’  సినిమా చేశా.  నరేష్ గారు చాలా సైలెంట్ పర్సన్.  అద్భుతమైన నటుడు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా.  ‘పొలిమేర’ నుంచే అనిల్ విశ్వనాథ్‌‌తో జర్నీ  స్టార్ట్ అయ్యింది. నిజానికి నాకు యాక్టింగ్‌‌తో  పాటు రైటింగ్ కూడా ఇష్టం. అందుకే ఆయన సినిమాల్లో నటిస్తూనే  డైరెక్షన్ డిపార్ట్‌‌మెంట్‌‌లోనూ  వర్క్ చేస్తా. అనిల్ కొన్ని ప్రాజెక్ట్స్‌‌తో బిజీగా ఉండటంతో ఆయన టీమ్ మెంబర్ అయిన నాని ఈ చిత్రాన్ని  రూపొందించారు. కొత్త దర్శకుడైనా అనుభవం ఉన్న వ్యక్తిలా డైరెక్ట్ చేశారు.  ఇక కథలో కీలకమైన పాత్రలు చేయాలనే భావిస్తున్నా. ప్రస్తుతం నటిస్తున్న  ‘డెకాయిట్’లో నా క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. అలాగే ‘పొలిమేర 3’ స్టార్ట్ చేయాలి’’.