
కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో ముప్ఫై ఆరేళ్ల తర్వాత ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కమల్ నటిస్తున్న 234వ సినిమా ఇది. ఇటీవల గ్రాండ్‌గా ప్రారంభించిన ఈ మూవీ టైటిల్‌ను సోమవారం ప్రకటించారు. ‘థగ్ లైఫ్’ అనే పవర్ ఫుల్ టైటిల్‌ను అనౌన్స్ చేస్తూ.. గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో కమల్ హాసన్ యాక్షన్ లుక్‌లో ఇంప్రెస్ చేస్తున్నారు. ఫైట్ సీక్వెన్స్‌లో కమల్ చేసిన పెర్ఫార్మెన్స్, బ్రిలియంట్ మార్షల్ ఆర్ట్స్ ఆకట్టుకుంటున్నాయి. మణిరత్నం టేకింగ్ స్టన్నింగ్‌గా అనిపించింది. రవి కె చంద్రన్ విజువల్స్‌తో పాటు ఏ.ఆర్.రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ పాన్ ఇండియా ఎంటర్ టైనర్‌లో దుల్కర్ సల్మాన్, జయంరవి, త్రిష ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ సమర్పణలో కమల్ హాసన్, మణిరత్నం, ఆర్ మహేంద్రన్, శివ అనంత్‌లు తమ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.