
జానర్ ఏదైనా, దర్శకుడు ఎవరైనా కమల్ హాసన్ ఓ సినిమాలో నటిస్తున్నారంటే కచ్చితంగా అది ఓ డిఫరెంట్ మూవీయే అవుతుందని అందరి నమ్మకం. అందుకు తగ్గట్టే ప్రతి చిత్రంలో కమల్ మార్క్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అలాగే కొందరు తమిళ యంగ్ డైరెక్టర్స్ కూడా ఎంత పెద్ద స్టార్ హీరోతో సినిమా చేసినా అందులో తమ మార్క్ ఉండేలా చూసుకుంటున్నారు. కమల్ అలాంటి యంగ్ డైరెక్టర్స్‌తో ట్రావెల్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఆల్రెడీ ‘ఖైదీ’ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో మెప్పించిన లోకేష్ కనకరాజ్ డైరెక్షన్‌లో ‘విక్రమ్’ సినిమా చేస్తున్నారు కమల్. ఈ మూవీ షూటింగ్ పూర్తవక ముందే మరో కొత్త సినిమాకి కమిటయ్యారని కోలీవుడ్ టాక్. పా రంజిత్ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందట. రియల్ ఇన్సిడెంట్స్‌కి కమర్షియల్ ఎలిమెంట్స్‌ని జోడించి, మాస్‌ని మెప్పించే సినిమాలు తీయడం రంజిత్ స్టైల్. కబాలి, కాలా సినిమాలతో రజినీకాంత్‌ను కొత్తగా ప్రెజెంట్ చేశాడు. స్టార్స్‌తోనే చేయాలని కూర్చోకుండా కాన్సెప్ట్‌కి ప్రయారిటీ ఇస్తూ ‘సార్పట్ట పరంపర’ అనే పీరియాడికల్ మూవీ కూడా తీశాడు. తన వర్కింగ్ స్టైల్ నచ్చి కమల్ అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. ‘విక్రమ్’ సినిమా పూర్తవగానే మహేష్ నారాయణన్ డైరెక్షన్‌లో నటించనున్నారు కమల్. అది అయ్యాక రంజిత్ మూవీ స్టార్టవుతుందట. ఆ తర్వాత వెట్రిమారన్‌తో కూడా వర్క్ చేసే ప్లాన్స్‌లో ఉన్నారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేసే హీరోలతోనూ తన మార్క్ సినిమాలు తీసిన పా రంజిత్, ప్రయోగాలకు కేరాఫ్ అయిన కమల్‌తో ఎలాంటి మూవీ తీస్తాడో మరి.