
కమల్ హాసన్, శంకర్ క్రేజీ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భారతీయుడు 2’. ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత సీక్వెల్‌గా వస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. జూన్‌లో ఈ సినిమా విడుదల చేయనున్నట్టు రీసెంట్‌గా ప్రకటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోందని, మే నెలాఖరున పవర్‌ప్యాక్డ్ ట్రైలర్‌ను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు మేకర్స్ తెలియజేశారు.
ఈ సందర్భంగా కమల్ హాసన్ కొత్త స్టిల్స్‌ను విడుదల చేశారు. ‘రెడ్ అలర్ట్.. సేనాపతి మళ్లీ వస్తున్నాడు’ అంటూ రెండు డిఫరెంట్ గెటప్స్‌ను రివీల్ చేశారు. ఇందులో కమల్ స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతిగా పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. కాజల్, రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, ఎస్‌జే సూర్య, బాబీ సింహా, మనోబాల, బ్రహ్మానందం, సముద్రఖని ఇతర పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ సంస్థలు కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.