Kamal Haasan: రాజకీయాల్లోకి వస్తే సినిమాలు వదిలేయాలా..నన్ను అలా చేయమంటే ఎలా?

Kamal Haasan: రాజకీయాల్లోకి వస్తే సినిమాలు వదిలేయాలా..నన్ను అలా చేయమంటే ఎలా?

సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత ఆ స్థాయిలో అభిమాన సంఘాలు ఉన్న ఏకైక హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay).తమిళనాడులో తమిళగ వెట్రి కజగం(TVK) అనే రాజకీయ పార్టీ పెట్టిన విజయ్ 2026 అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలువనున్నారు. అయితే..హీరో విజయ్ ప్రస్తుతం కోలీవుడ్లో స్టార్ స్టేటస్తో పాటు మంచి సక్సెస్ అందుకుంటున్నాడు. 

విజయ్ సినిమాల కోసం కోలీవుడ్, టాలీవుడ్ లోనే కాదు ఇండియా వైడ్గా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.  కానీ, విజయ్ పార్టీ పెట్టడంతో..ఇకమీదట సినిమాల్లో నటించనని ప్రకటించడంతో ఆయన ఫ్యాన్స్ డిస్సపాయింట్ అవుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విశ్వనటుడు కమల్‌ హాసన్‌ని (Kamal Haasan) ఈ అంశంపై ప్రశ్నించగా తనదైన శైలిలో స్పందించారు. 

‘‘ముందుగా విజయ్‌ పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చినందుకు శుభాకాంక్షలు. అతను రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు ప్రోత్సహించిన వారిలో నేనూ ముందు వరసలో ఉంటాను. వీటి గురించి మేము చాలా కాలంగా చర్చించుకున్నాం కూడా. అయితే..ఒక రంగంలో కొనసాగాలంటే మరో రంగాన్ని విడిపెట్టాలని మాత్రం లేదు.

రాజకీయాలా? సినిమాలా? అన్నది విజయ్‌ వ్యక్తిగత అభిప్రాయం. ఆయన చేసే సినిమాలు చాలా విభిన్నంగా ఉంటాయి. నన్ను అలా చేయమంటే ఎలా? నా స్టైల్..నా విధానం ఒకలా ఉంటుంది. అద్భుతంగా పాటలు రాసే ఓ రైటర్ లా మీరు పాట రాయండి అంటే అది సాధ్యం కాదు. ఎవరి శక్తి సామర్థ్యం వారిది. రాజకీయాల్లో ఉంటూనే నేను సినిమాలు చేస్తాను ’’అని కమల్‌ హాసన్ వెల్లడించారు. 

కమల్‌ హాసన్‌ 36 ఏళ్ల తర్వాత మరోసారి దిగ్గజ డైరెక్టర్ మణిరత్నం(Mani Ratnam) దర్శకత్వంలో ‘థగ్‌ లైఫ్‌’అనే చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు దళపతి విజయ్‌ వెంకట్‌ ప్రభు తెరకెక్కిస్తున్న ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’(The GOAT) మూవీ చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్‌ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు.