కమల్ సీఎం అయితే కుళ్లుకుంటానన్న రజనీ.. కమల్ హాసన్ స్మార్ట్ రిప్లై ..

కమల్ సీఎం అయితే కుళ్లుకుంటానన్న రజనీ.. కమల్ హాసన్  స్మార్ట్  రిప్లై ..

 కమల్ హాసన్ సీఎం అయ్యి ఉంటే తాను ఖచ్చితంగా అసూయపడేవాడినంటూ రజనీ  చేసిన వ్యాఖ్యలపై  కమల్ హాసన్ స్పందించారు. రజనీకాంత్ ఆ మాటలను కేవలం సరదాగా, నవ్వుతూ అన్నారని... అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని  స్పష్టం చేశారు.తమ మధ్య ఉన్న బంధం గురించి కమల్ హాసన్ మాట్లాడుతూ... మేమిద్దరం ఎప్పుడూ ఒకరితో ఒకరు పోటీ పడుతూనే ఉంటాం, కానీ మా మధ్య ఎప్పుడూ అసూయ అనేది లేదు. తమిళనాడులోనే మమ్మల్ని మించిన బెస్ట్ స్పోర్ట్స్‌మెన్‌ను మీరు చూడలేరు అని చెప్పుకొచ్చారు.

 ఒకవేళ తామిద్దరం క్రికెటర్లు అయి ఉంటే కూడా పరిస్థితి ఇలాగే ఉండేదన్నారు. గతంలో కూడా వీరిద్దరి మధ్య పోటీ ఉందనే ప్రచారాన్ని కమల్ కొట్టిపారేశారు. తామిద్దరం ఒకే క్యాంప్ నుంచి వచ్చామని, మార్కెట్ శక్తులే తమ మధ్య పోటీ ఉన్నట్లు భ్రమ కల్పించాయని, మ్యాచ్ ఆసక్తికరంగా సాగాలంటే రెండు గోల్స్ అవసరం కాబట్టే తాము కూడా దానికి సహకరించామని గతంలో కమల్ వ్యాఖ్యానించారు.

రాజకీయాల సంగతి పక్కన పెడితే... ఇటు వెండితెరపై అభిమానులకు ఒక భారీ విందు భోజనం సిద్ధమవుతోంది. దశాబ్దాల కాలం తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి ఒకే స్క్రీన్‌పై కనిపించబోతున్నారు.టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దర్శకత్వంలో KH x RK అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ క్రేజీ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కనుంది. రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్‌పై ఇన్బన్ ఉదయనిధి నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టుకు అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, రాజీవ్ మీనన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. రజనీ, కమల్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూడాలని తహతహలాడుతున్న అభిమానులకు ఈ సినిమా ఒక ఐ-ఫీస్ట్‌గా మారడం ఖాయం.