Kamal Haasan: కొత్త భారత దేశాన్ని నిర్మిద్దాం..ఓటు విలువపై కమల్ వీడియో

Kamal Haasan: కొత్త భారత దేశాన్ని నిర్మిద్దాం..ఓటు విలువపై కమల్ వీడియో

కమల్ హాసన్(Kamal Haasan)..డిఫరెంట్‌‌ గెటప్స్‌‌కి కేరాఫ్‌‌ ఆయన. ఇండియన్ సినిమాలో ఏ యాక్టర్‌‌ కూడా చేయనన్ని ఎక్స్‌‌పరిమెంట్స్‌‌ చేశాడు. ఆస్కార్ రేంజ్ యాక్టింగ్‌‌తో ఉత్తమ నటుడిగా కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు.‘ఉళగనాయగన్‌‌’, ‘లోకనాయకుడు’, ‘యూనివర్సల్ హీరో’..ఏ భాషలో  పిలుచుకున్నా సరే.. సిల్వర్‌‌స్క్రీన్‌‌కి ఆయనొక లెజెండ్‌‌.

లేటెస్ట్గా నేషనల్ ఓటర్స్ డే (NationalVotersDay) సందర్భంగా కమల్ హాసన్ ఓటు విలువను చెబుతూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఓటు అనేది దేశం పట్ల మనకున్న నిబద్ధతను తెలిపేది. 2024 నేషనల్ ఓటర్స్డే సందర్భంగా..ప్రతి ఒక్కరం ఓటుని వినియోగించుకుంటామని ప్రతిజ్ఞ చేద్దాం. కొత్త లీడర్స్ను ఎంచుకుంటూ..కొత్త విప్లవాన్ని..కొత్త భారత దేశాన్ని నిర్మిద్దాం. నీ ఓటు..ఒక్క పార్టీకో..ఒక్క నాయకుడికో..ఒక్క ఆలోచన విధానానికో పరిమితం కాకూడదు. నీ ఓటు గతాన్ని..ప్రస్తుత పరిస్థితులని..భవిష్యుత్తుని తెలియజేసే ఆయుధంగా ఉండాలంటూ..సందేశాన్ని పంపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

ప్రస్తుతం కమల్ హాసన్ ఇండియన్ 2 తో పాటు..మణిరత్నం డైరెక్షన్ లో థగ్ లైఫ్, ప్రభాస్ కల్కి మూవీలో నటిస్తున్నాడు. మరికొన్ని సినిమాలు లైనప్ లో ఉన్నాయి.