
ఉలగనాయగన్ కమల్ హాసన్(Kamal Haasan) వరుస ప్రాజెక్ట్స్తో దూసుకెళ్తున్నారు. లేటెస్ట్గా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హెచ్.వినోద్(H.Vinod) డైరెక్షన్లో#KH233 రైజ్ టు రూల్ ట్యాగ్ లైన్ తో ఓ భారీ యాక్షన్, అడ్వెంచరస్ మూవీని తెరకెక్కిస్తున్నారు.ఈ క్రేజీ ప్రాజెక్ట్లో కమల్ హాసన్ మెషీన్ గన్స్ తో ట్రైనింగ్ తీసుకొనే వీడియోని రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ ప్రొడక్షన్(RKFI) ట్వీట్ చేసింది. గట్స్ & గన్స్ పేరుతో రిలీజ్ చేసిన ఈ వీడియో కమల్ హాసన్ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తుంది.
హెచ్.వినోద్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి కమల్ హాసన్ స్టోరీని అందిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ మూవీపై అంచనాలు అమాంతం పెరిగాయి. సొసైటీ లో జరిగే ఒక రియల్ ఇన్సిడెంట్ను బేస్ చేసుకుని, కమర్షియల్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై డైరెక్టర్ హెచ్.వినోద్ మాట్లాడుతూ.. ఇది నాకు ప్రత్యేకమైన ప్రాజెక్ట్, ఉలగనాయగన్ కమల్ హాసన్ తో కలిసి పనిచేయడం, ఆయన కథ అందించడం చాలా హ్యాపీ. కమల్ సర్ సినిమాలు చూస్తూ ఎన్నో అంశాలు నేర్చుకున్నాను. ఆయన మానవతా ఆలోచనలు, సామాజిక స్పృహ,చేపట్టిన ప్రతి పనిలో రాణించాలనే తపన..నిజంగా స్ఫూర్తిదాయకమైనవి. వరల్డ్ వైడ్గా ఉన్న కమల్ హాసన్ ఫ్యాన్స్ ను మెప్పించడమే
నా లక్ష్యం..అని అన్నారు.
అలాగే ఈ మూవీకి యాక్టర్, ప్రొడ్యూసర్ అయినా కమల్‌హాసన్ మాట్లాడుతూ..ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమలో ఎన్నో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్త ప్రతిభని స్వీకరించడం, ఉన్నత వినోద విలువలతో నాణ్యమైన చిత్రాలను రూపొందించడానికి సహకరించడం అత్యవసరం. నేను నా అనుభవాన్ని పంచుకోవడానికి..అలాగే కొత్త విషయాలను తెలుసుకోవడానికి..రాబోయే తరానికి చెందిన ప్రతిభావంతులతో పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను.
వినోద్ సృజనాత్మకత,కంటెంట్ పట్ల నిబద్ధత కలిగి వున్న దర్శకుడు. సామాజిక ప్రాధాన్యతతో కూడిన కథలకు కమర్షియల్ అంశాలు జోడించి సక్సెస్‌ఫుల్ సినిమాలు తీస్తారనే పేరు వుంది. RKFI 52 కూడా ఇలాంటి కలయికలోనే వుంది. ఈ చిత్రానికి కథ అందిస్తున్నందుకు చాలా ఎక్సయిటెడ్‌గా వున్నాను.. అంటూ కమల్ తెలిపారు. త్వరలో ఈ మూవీకి సంభందించిన టెక్నీషన్స్,యాక్టర్స్ వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం కమల్ హాసన్ శంకర్ డైరెక్షన్ లో వస్తోన్న ఇండియన్ 2, ప్రభాస్ కల్కి మూవీలో నటిస్తున్నారు.
Guts & Guns ?
— Raaj Kamal Films International (@RKFI) September 7, 2023
Training Begins #FuriousAction in #KH233#Ulaganayagan #KamalHaasan #RKFI52 #RISEtoRULE@ikamalhaasan #Mahendran #HVinoth@RKFI @turmericmediaTM @magizhmandram pic.twitter.com/Mec86yIhlh