కమల్ టార్గెట్ మారింది

V6 Velugu Posted on May 09, 2021

దేశం గర్వించే మహానటుడు కమల్ హాసన్. కానీ కొంతకాలంగా ఆయన దృష్టంతా రాజకీయాలపైనే ఉంది. ‘ఇండియన్ 2’ చేస్తున్నారు కదా అనుకుంటే అది వివాదాల్లో కూరుకుపోయింది. ‘విక్రమ్’ సినిమా స్టార్ట్ చేశారు కానీ ఎలక్షన్స్ కారణంగా అది కాస్త స్లో అయ్యింది. అయితే ఇప్పుడు సినిమాల పరంగా కమల్ స్పీడ్ పెంచబోతున్నట్లు కోలీవుడ్‌‌ నుంచి సమాచారం అందుతోంది. తాజా ఎన్నికల్లో కమల్ పార్టీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన తన ఫోకస్ అంతా సినిమాలపైనే పెడుతున్నారట. డిఫరెంట్ రోల్స్‌‌తో ఎక్స్‌‌పెరిమెంట్స్ చేసి ప్రేక్షకుల్ని మెప్పించే కమల్.. ఆగిపోయిన శంకర్ సినిమాని పట్టాలెక్కించే బాధ్యతను తీసుకుంటున్నారట. అలాగే లోకేష్ కనకరాజ్ డైరెక్షన్‌‌లో మొదలుపెట్టిన ‘విక్రమ్‌‌’ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేయాలనుకుంటున్నారట. తాజాగా మరో రెండు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అలాగే కమల్ సొంత బ్యానర్‌‌‌‌పై కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ నిర్మించడానికి కూడా ప్లాన్ చేస్తున్నారట. వాటిలో రజినీతో కలిసి చేయబోయే సినిమా ఒకటి అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ఇదే నిజమైతే ప్రేక్షకులకి కావలసింది ఏముంటుంది! 

Tagged POLITICS, cinema, Kamal Haasan, kollywood,

Latest Videos

Subscribe Now

More News