ఆమె అధ్యక్షురాలైతే అమెరికాకు అవమానమే

ఆమె అధ్యక్షురాలైతే అమెరికాకు అవమానమే

నార్త్ కరోలినా: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. తాజాగా డెమొక్రాట్ వైస్ ప్రెసిడెంట్ నామినీ కమలా హ్యారిస్ ను టార్గెట్ గా చేసుకొని ప్రెసిడెంట్ ట్రంప్ దాడికి దిగారు. ప్రజలు కమలను ఇష్టపడరన్నారు. ఒకవేళ ఆమె యూఎస్ ప్రెసిడెంట్ అయితే మాత్రం అది తమ దేశానికి అవమానకరమని విమర్శించారు. పనిలో పనిగా బిడెన్ తోపాటు చైనాపైనా ట్రంప్ విరుచుకుపడ్డారు.

‘మీరు దీన్ని గుర్తు పెట్టుకోవడం చాలా సులువు. ఒకవేళ బిడెన్ గెలిస్తే చైనా విజయం సాధించినట్లే. ఇది చాలా సులభం మరి. మనం ప్రపంచంలోనే అత్యుత్తమ ఎకానమీని రూపొందించే పనిలో ఉన్నాం. సరిగ్గా అప్పుడే చైనా ప్లేగు వ్యాధి రంగంలోకి దిగింది. దీని వల్ల బలవంతంగా ఎకానమీని ఆపేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మళ్లీ ఎకానమీని తెరిచాం. ప్రజలు ఆమె (కమలా హ్యరిస్)ను ఇష్టపడరు. ఏ ఒక్కరికీ ఆమె నచ్చదు. యూఎస్ కు ఆమె తొలి ప్రెసిడెంట్ కాబోదు. ఒకవేళ ఆమె అధ్యక్షురాలైతే మాత్రం అది మన దేశానికి అవమానమే. ఆమె ప్రెసిడెంట్ రేసు నుంచి తప్పుకొంది. అయితే ఆసక్తికరంగా ఆమెను వాళ్లు తీసుకున్నారు. ఎందుకంటే థియరీ ప్రకారం వాళ్లు కాలిఫోర్నియాలో గెలవాలి. కానీ దీని కోసం వాళ్లు ఆడేలా చేద్దాం. మీరు ఎన్నికల్లో ముందంజలో ఉండే వాళ్లనే తరచూ ఎంపిక చేసుకుంటూ వచ్చారు’ అని ట్రంప్ పేర్కొన్నారు.