న్యూఢిల్లీ: శ్రీలంకతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఇండియా విమెన్స్ జట్టును మంగళవారం (డిసెంబర్ 09) ప్రకటించారు. కొత్తగా గునలాన్ కమళిని, వైష్ణవి శర్మకు తొలిసారి టీమ్‌లో చోటు కల్పించారు. 17 ఏళ్ల కమళిని విమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించింది.
వరల్డ్ కప్ సెమీస్‌లో ఆడిన షెఫాలీ వర్మ ప్లేస్‌ను కాపాడుకుంది. డిసెంబర్ 21 నుంచి 30 వరకు జరిగే ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు విశాఖపట్నం, తర్వాతి మూడు మ్యాచ్‌లకు తిరువనంతపురం ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), దీప్తి శర్మ, స్నేహ్ రాణా, జెమీమా రొడ్రిగ్స్, షెఫాలీ వర్మ, హర్లీన్ డియోల్, అమన్‌జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ ఠాకూర్, రిచా ఘోష్, కమళిని, శ్రీచరణి, వైష్ణవి శర్మ.

