వర్షానికి రోడ్డు కొట్టుకపోయింది.. రాకపోకలు బంద్

వర్షానికి  రోడ్డు కొట్టుకపోయింది..  రాకపోకలు బంద్

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలో కురిసిన భారీ వర్షానికి పంటలన్నీ దెబ్బతిన్నాయి. అటు కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసింది. అకాల వర్షానికి కామారెడ్డి మెదక్ వైపు వెళ్లే రోడ్డు కొట్టుకపోయింది. వరద ధాటికి రోడ్డు తెగిపోయింది. రెండు జిల్లాల మధ్య  రాకపోకలు నిలిచిపోయాయి. ఈ రోడ్డులో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ముఖ్యంగా రాజంపేట మండలం కొండాపూర్, ఎల్లారెడ్డిపల్లి గ్రామల మధ్య రాకపోకలు స్థంభించాయి. దీంతో వాహనాదారులు  తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు, జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 30వ తేదిన కురిసిన కుండపోత వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి.. నీటిలో కొట్టుకుపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.