కామారెడ్డి టౌన్, వెలుగు : మున్సిపల్ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగుల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియను సోమవారం ఎలక్షన్ జనరల్ అబ్జర్వర్ ప్రశాంత్‌కుమార్, అడిషనల్ కలెక్టర్లు వి. విక్టర్, మదన్మోహన్ సమక్షంలో కలెక్టరేట్‌లో నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించేందుకు అధికారులు, సిబ్బందిని ఎంపిక చేశారు. కార్యక్రమంలో సీపీవో రఘునందన్, ఎస్‌వో శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
4న పోలింగ్ సిబ్బందికి శిక్షణ..
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి బుధవారం శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా జనరల్ అబ్జర్వర్ ప్రశాంత్‌కుమార్ తెలిపారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బాన్సువాడ మున్సిపల్ కార్యాలయం, ఎల్లారెడ్డి ఎంపీడీవో కార్యాలయం, బిచ్‌కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శిక్షణలు నిర్వహిస్తామన్నారు. పోలింగ్ అధికారులు 239 మంది, అసిస్టెంట్ పోలింగ్ అధికారులు 239 మంది, ఓపీవోలు 645 మందిని నియమించనున్నట్లు తెలిపారు. 1,195 మంది సిబ్బందిని ఎన్నికల విధులకు వినియోగించనున్నట్లు పేర్కొన్నారు.
