
కామారెడ్డి జిల్లాలో మరోసారి రికార్డ్ స్థాయిలో కరోనా కేసుల నమోదయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే జిల్లాలో మొత్తం 49మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో జిల్లా వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 289 కి చేరింది. ఇదిలా ఉండగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కిరాణా దుకాణాల యజమానుల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి ఈ నెల 26 దాకా కిరాణా దుకాణాలు పూర్తిగా మూసివేయాలని, ఇందుకోసం ప్రజలు సహకరించాలని కిరాణా వర్తక వ్యాపారులు కోరారు.