KKRతో మ్యాచ్..టాస్ గెలిచిన హైదరాబాద్

KKRతో మ్యాచ్..టాస్ గెలిచిన హైదరాబాద్

ఐపీఎల్ 2022 సీజన్‌లో శుక్రవారం సన్‌రైజర్స్  హైదరాబాద్‌ కేకేఆర్‌ను ఎదుర్కోనుంది. టాస్‌ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. తొలుత ఓటములతో లీగ్‌ను ప్రారంభించినప్పటికి రెండు వరుస విజయాలతో ఎస్‌ఆర్‌హెచ్‌ ఫామ్‌లోకి వచ్చింది. మరోవైపు కేకేఆర్‌ ఐదు మ్యాచ్‌ల్లో మూడింట గెలిచి.. రెండు ఓడింది. ఇరు జట్ల మధ్య గత రికార్డులను పరిశీలిస్తే.. సన్‌రైజర్స్‌పై కేకేఆర్‌ పూర్తి ఆధిపత్యం కలిగి ఉంది. ఇరు జట్లు 21సార్లు తలపడగా.. కేకేఆర్‌ 14, ఆరెంజ్‌ ఆర్మీ 7 మ్యాచ్‌ల్లో విజయాలు నమోదు చేశాయి.