సుశాంత్ సింగ్‌లాగే ఈ హీరోనూ చంపేస్తారా? 

V6 Velugu Posted on Apr 17, 2021

ముంబై: ప్రముఖ హిందీ నిర్మాత కరణ్ జోహర్‌‌కు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ వార్నింగ్ ఇచ్చింది. యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ కెరీర్‌‌ను పాడు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించింది. కరణ్ జోహర్ నిర్మాణంలో ధర్మ ప్రొడక్షన్ హౌస్.. హిట్ మూవీ దోస్తానాకు సీక్వెల్‌‌గా దోస్తానా-2ని తీస్తోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్‌‌ను హీరోయిన్‌గా.. హీరోలుగా కార్తీక్ ఆర్యన్, లక్ష్ లల్వానీని ఎంపిక చేసింది. 2019లో అనౌన్స్ అయిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి లాక్‌డౌన్ వల్ల షూటింగ్ ఆగిపోయింది. తాజాగా కొంత మేర షూటింగ్ జరిగింది. అయితే హీరో కార్తీక్ ఆర్యన్‌కు ఇతర సినిమాల కమిట్‌‌మెంట్స్ ఉండటంతో కాల్షీట్ల సమస్య ఎదురైంది. దీంతో దోస్తానాకు తాను మరిన్ని డేట్స్ కేటాయించలేనని చెబుతూ మూవీ నుంచి కార్తీక్ ఆర్యన్ తప్పుకున్నాడు. 

కరణ్ జోహర్ మూవీ నుంచి కార్తీక్ ఆర్యన్ తప్పుకోవడం హాట్ టాపిక్‌‌గా మారింది. ఈ విషయంపై కంగన స్పందించింది. కార్తీక్ కెరీర్‌ను పాడు చేయొద్దని, అతడ్ని మరో సుశాంత్ సింగ్‌లా మార్చొద్దని కరణ్‌‌పై కంగన ఫైర్ అయ్యింది. ‘కార్తీక్ ఆర్యన్ తన సొంత ప్రతిభతో ఈస్థాయికి వచ్చాడు. ఇక పైనా తన టాలెంట్‌‌తోనే కొనసాగుతాడు. కరణ్‌తోపాటు అతడి గ్యాంగ్‌కు ఓ విషయం రిక్వెస్ట్ చేస్తున్నా.. అతడ్ని వదిలేయండి. సుశాంత్ సింగ్‌‌ విషయంలో చేసినట్లు కార్తీక్‌‌ వెంటపడి అతడు సూసైడ్ చేసుకునేలా చేయకండి. రాబందుల్లారా అతడ్ని ఒంటరిగా వదిలేయండి’ అని కంగన వార్నింగ్ ఇచ్చింది. 

కార్తీక్ ఆర్యన్‌‌కు మద్దతుగా కంగన మరో ట్వీట్ చేసింది. ఇలాంటి చిల్లర వ్యక్తులకు భయపడొద్దని సూచించింది. ‘కార్తీక్ ఇలాంటి చిల్లర మనుషులకు భయపడకు. ఏమీ కాదు. దీనంతటికీ నువ్వే కారణమని, నీ వ్యక్తిత్వమే తప్పంటూ కొన్ని ఆర్టికల్స్ ప్రచురించారు. వాళ్లేదో మౌనం వహిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. వాళ్లు సుషాంత్ విషయంలోనూ ఇలాగే చేవారు. డ్రగ్స్‌కు బానిసయ్యాడు, అన్‌‌ప్రొఫెషనల్ బిహేవియర్ అంటూ అతడిపై అబద్ధపు కథనాలు రాయించారు. మేం నీతో ఉన్నాం కార్తీక్.. నిన్ను టార్గెట్ చేశారని బాధపడకు. వీళ్ల డ్రామాలు అందరికీ తెలుసు. నీ మీద నువ్వు నమ్మకం ఉంచుకో’ అని కంగన సలహా ఇచ్చింది. 

 

Tagged Bollywood, Controversy, karan johar, kangana ranaut, Sushant Singh Rajput, Kartik Aaryan, Dostana 2

Latest Videos

Subscribe Now

More News