
రోజురోజుకీ బాలీవుడ్ ప్రముఖ నటి మరియు బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ వ్యవహారం పార్టీ నేతలకి తలనొప్పి తెస్తోంది. అయితే కంగనా ఈరోజు (సెప్టెంబర్ 24)న రైతు చట్టాలపై చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో గతంలో రద్దు చేసిన 3 వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావాలని కోరింది. అంతేగాకుండా రైతులకు మేలు చేసే ఈ చట్టాలు మళ్ళీ తిరిగి అమలు చేసేందుకు రైతులు డిమాండ్ చెయ్యాలని సూచించింది.
అలాగే రద్దు చేసిన 3 వ్యవసాయ చట్టాలు మళ్ళీ తిరిగి తీసుకురావడం వలన ఎంతోమంది రైతులు లబ్ది పొందుతారని కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి రైతులు పోరాటం చెయ్యాలని అభిప్రాయం వ్యక్తం చేసింది. కంగనా చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీలో తలనొప్పిగా మారాయి.
ALSO READ | చివరి వ్యక్తి వరకు సంక్షేమ ఫలాలు అందాలి : స్పీకర్ ఓం బిర్లా
వ్యవసాయ చట్టాలపై కంగనా రనౌత్ చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా కంగనా మానసిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదని అలాగే పాపులారిటీ కోసం ఇలా రైతులను రచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో మాట్లాడుతుందని కాబట్టి వెంటనే సరైన డాక్టర్ ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచిస్తున్నారు.
BJP MP & Actress Kangana Ranaut says "three farms bills that were repealed should be brought back"#Punjab pic.twitter.com/rqjQneVcI3
— Akashdeep Thind (@thind_akashdeep) September 24, 2024