అమ్మ పాత్ర చేయడం అంత ఈజీ కాదు

V6 Velugu Posted on Sep 08, 2021

అంత ఈజీ కాదు‘‘జయలలిత పాత్రకి న్యాయం చేయగలనా అనిపించింది. డైరెక్టర్ విజయ్ ధైర్యాన్నిచ్చారు. పదహారేళ్ల నుండి నలభయ్యేళ్ల జయలలితగా కనిపించాలి. అందుకే ఇరవై కేజీల బరువు పెరిగాను. జయలలిత సినిమాల్లోకి వచ్చిన కొత్తలో జూనియర్ ఆర్టిస్ట్ అన్నారు. పాలిటిక్స్‌‌‌‌లో గేలి చేశారు. కానీ తర్వాత ఆమె చక్రం తిప్పారు. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నన్నూ వెక్కిరించారు.  కానీ ఎన్నో విజయాలు సాధించాను. జయమ్మ రాజకీయాల్లోనూ సక్సెస్ అయ్యారు. కానీ నాకు పాలిటిక్స్‌‌‌‌లోకి రావాలనే ఆలోచన ఇప్పటికైతే లేదు. పొలిటికల్ గేమ్స్ ఎలా ఉంటాయో ఈ సినిమా చేశాక తెలిసింది. రాజకీయాల మీద నా అభిప్రాయం మారిపోయింది. ఒక మనిషిలో అన్నీ మంచి లక్షణాలే ఉండవు. అయితే మన మధ్య లేని మనిషి జీవితాన్ని తెరకెక్కిస్తున్నాం కాబట్టి ఓ బాధ్యత ఉంటుంది. జయ జీవితం గురించి అందరికీ తెలుసు కనుక సినిమాటిక్ లిబర్టీ తీసుకునే చాన్స్ లేకుండా పోయింది. ఆమె ఎందుకు అలాంటి నిర్ణయాలు తీసు కున్నారో అవతలి నుంచి ఊహించుకున్నాను. అదే మానసికంగా ఈ సినిమాకి నేను పడ్డ కష్టం. అమ్మ పాత్రను పోషించడం అంత ఈజీ కాదు.  ఆవిడ సినిమాలు మానేశాక డ్యాన్స్ స్కూల్  పెట్టారు. ఆ సీన్స్ కోసం నేను భరతనాట్యం నేర్చుకున్నాను. ప్రోస్థటిక్ మేకప్‌‌‌‌తో ఒకే ఒక్క సీన్ చేశాం. క్లైమాక్స్‌‌‌‌లో ఉంటుంది. బాలీవుడ్‌‌‌‌లో కొన్ని చోట్ల థియేటర్స్ తెరవలేదు. అందుకే ఇది ప్యాన్ ఇండియన్ సినిమాగా విడుదలవడం లేదు. ఇక్కడ సినిమాల రిలీజ్‌‌‌‌కి వెల్‌‌‌‌కమ్‌‌‌‌ చెబుతున్న మల్టీప్లెక్సులు హిందీలో రిలీజ్‌‌‌‌కి ఒప్పుకోవడం లేదు. ఇది తప్పు. ‘రాధే’ సినిమాని ఒకే రోజు థియేటర్‌‌‌‌‌‌‌‌లో, ఓటీటీలో విడుదల చేశారు. కానీ నా మీద, నా సినిమాల మీద ద్వేషాన్ని చూపిస్తున్నారు. హీరోల సినిమాకు ఒకలా, హీరోయిన్ల సినిమాకు మరోలా చేస్తున్నారు. ఈ గ్రూపిజం కరెక్ట్ కాదు. తమిళంలో ‘ధామ్ ధూం’ తర్వాత  ఇన్నేళ్లకి విజయ్ నాకీ ఆఫర్ ఇచ్చారు. ‘ప్రభాస్‌‌‌‌కి జంటగా చాన్స్ ఇవ్వండి, తెలుగులో ఎందుకు చేయను’ అని పూరి జగన్నాథ్‌‌‌‌ని అడుగుతుంటాను. ఆయన పిలిస్తే మళ్లీ సినిమా చేస్తాను. పిలవాలని ఆశిస్తున్నాను. నాకు మనాలి తర్వాత అంతగా నచ్చే ప్లేస్ హైదరాబాద్. ఎన్నో సినిమాల షూటింగ్స్ ఇక్కడ చేశాను. చాలామంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఇందిరాగాంధీ బయోపిక్ చేస్తున్నా. ఎప్పుడూ ఒకే పని చేయడం నాకు విసుగు. స్టోరీస్ రాయడం, డైరెక్షన్ చేయడం లాంటివి కూడా ఇష్టం.’’ 

Tagged jayalalitha, kangana ranaut, play, role, Thalaivii Movie

Latest Videos

Subscribe Now

More News