‘గజినీ బైడెన్’ ఏడాదికి మించి ఉండరు.. కమలా హారిసే ప్రెసిడెంట్

‘గజినీ బైడెన్’ ఏడాదికి మించి ఉండరు.. కమలా హారిసే ప్రెసిడెంట్

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ స్పందించింది. కమలా హ్యారిస్ విజయాన్ని మెచ్చుకున్న కంగనా.. జో బైడెన్‌‌ను గజినీ బైడెన్ అంటూ కామెంట్ చేసింది. కమలా హ్యారిస్ విక్టరీ స్పీచ్‌‌ను షేర్ చేసిన కంగనా.. భావి అమెరికాను ఆమే నడిపిస్తుందని చెప్పింది. ‘నాకు గజినీ బైడెన్ మీద అంతగా నమ్మకం లేదు. ఆయన డేటా ప్రతి 5 నిమిషాలకు క్రాష్ అవుతూ ఉంటుంది. ఆయనకు ఇచ్చిన ఇంజెక్షన్‌‌‌ల వల్ల ఏడాది కంటే ఎక్కువ కాలం ప్రెసిడెంట్‌‌గా కొనసాగకపోవచ్చు. కమలా హ్యారిసే ప్రభుత్వాన్ని నడిపిస్తారు. ఎప్పుడైతే ఓ మహిళ దూసుకొస్తుందో.. అందరు మహిళకు ఆమె దారి చూపిస్తుంది. చారిత్రాత్మక గెలుపుకు చీర్స్’ అంటూ కంగన ట్వీట్ చేసింది.