నుపుర్ శర్మకు మద్దతుగా కంగన కామెంట్స్..

నుపుర్ శర్మకు మద్దతుగా కంగన కామెంట్స్..

ఇటీవల బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆమె చేసిన వ్యాఖ్యలు పలు ప్రాంతాల్లో అల్లర్లకు దారితీశాయి. అయితే నుపుర్ ఈ వ్యాఖ్యలు చేసిన అనంతరం అమెను బీజేపీ హైకమండ్ పార్టీ నుండి బహిష్కరించింది. ప్రస్తుతం నుపుర్ శర్మ వ్యాఖ్యలపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. అయితే కొంతమంది మాత్రం నుపుర్ వ్యాఖ్యలకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా స్పందించింది.

రంగస్థలంపై శివుడి పాత్రను పోషించే వ్యక్తిని తన కోరిక తీర్చాలంటూ మరో వ్యక్తి ఇబ్బంది పెడతాడు.దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది కంగన.. తాను హిందువుగా ఉండటానికి ఇష్టపడటానికి ఇది కూడా ఒక కారణమని చెప్పింది. ఇలాంటివి కూడా తన ఆథ్యాత్మికతకు లేదా విశ్వాసానికి భంగం కలిగించవని తెలిపింది. అయితే కేవలం ఒక మహిళ చేసిన కామెంట్ల వల్ల దేశం మొత్తాన్ని ఇబ్బంది పెడుతున్నారని కంగన వ్యాఖ్యానింది. ఇలాంటి పనులు ఎవరు చేస్తారని ప్రశ్నించింది. ఇది సరైన పద్ధతి కాదంటూ కంగనా తన ఇన్ స్టా స్టోరీలో పేర్కొంది.