నా బాడీలో కరోనా పార్టీ చేసుకుంటుంటే గుర్తించలేకపోయా

V6 Velugu Posted on May 08, 2021

ముంబై: బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌‌కు కరోనా సోకింది. రీసెంట్‌గా తనకు నిర్వహించిన టెస్టుల్లో వైరస్ పాజిటివ్‌‌గా తేలిందని కంగన తెలిపింది. ఈమధ్యే ఆమె అకౌంట్‌ను ట్విట్టర్ శాశ్వతంగా తొలగించడంతో.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కంగన తనకు కరోనా సోకిన విషయాన్ని ఫ్యాన్స్, ఫాలోవర్లతో పంచుకుంది. ఇది ఓ చిన్న ఫ్లూ మాత్రమేనని త్వరలోనే దాన్ని అంతం చేస్తానని పోస్ట్ చేసింది. గత కొద్ది రోజులుగా కాస్త అలసిపోయినట్లు అనిపిస్తోందని, దీంతో కరోనా టెస్టు చేయించుకున్నట్లు తెలిపింది.

‘కరోనా పాజిటివ్‌‌గా తేలిన వెంటనే క్వారంటైన్‌‌లోకి వెళ్లా. ఈ వైరస్ నా శరీరంలోకి చేరి పార్టీ చేసుకుంటోందన్న విషయాన్ని గుర్తించలేకపోయా. ఇప్పుడు తెలుసుకున్నా. కాబట్టి త్వరలో దీన్ని నాశనం చేస్తా. మీరు భయపడితే ఈ వైరస్ మనల్ని భయపెడుతుంది. రండి.. అందరూ కలసి దీన్ని అంతం చేద్దాం. ఇదో చిన్న ఫ్లూ మాత్రమేనని అర్థం చేసుకోవాలి’ అని కంగన పేర్కొంది.

Tagged Actress Kangana Ranaut, flu, COVID positive, Amid Corona Surge

Latest Videos

Subscribe Now

More News