నాకు నష్టపరిహారం ఇప్పించండి

నాకు నష్టపరిహారం ఇప్పించండి

బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు అక్రమ నిర్మాణం కింద తన ఆఫీసును కూల్చడాన్ని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అవమానంగా భావిస్తున్నారని.. అందుకు నష్టపరిహారాన్ని కోరుతున్నారని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే తెలిపారు. కంగనా ఆఫీసును కూల్చిన ఘటనపై మంత్రి.. కంగనాను కలిసి గంటకు పైగా మాట్లాడారు. ఆ తర్వాత అథవాలే విలేకరులతో మాట్లాడారు.

‘కంగనా రనౌత్ తన ఆఫీసు కూల్చిన విషయంపై నాతో మాట్లాడారు. ముంబైలో ఎవరికైనా నివసించే హక్కు ఉంది. ముంబై దేశ ఆర్ధిక రాజధాని. ఇక్కడ ఎవరికీ భయపడనవసరం లేదు. మా పార్టీ మీకు అండగా ఉంటుంది. కార్యాలయం కూల్చడాన్ని అవమానంగా భావిస్తున్నట్లు ఆమె నాకు చెప్పారు. జనవరిలో నిర్మించిన ఆమె కార్యాలయం దెబ్బతింది. బిల్డర్ కార్యాలయాన్ని 2-3 అంగుళాలు వెలుపలికి అదనంగా నిర్మించాడని.. ఆ విషయం తనకు తెలియదని ఆమె అన్నారు. బీఎంసీ ఆ అదనపు నిర్మాణాన్ని మాత్రమే కూల్చివేసి ఉండాలి. కానీ, అదనపు నిర్మాణాన్ని కూల్చుతున్నప్పుడు లోపలి గోడలు మరియు ఫర్నిచర్ దెబ్బతిన్నాయి. తనకు కలిగిన ఈ నష్టానికి పరిహారం చెల్లించాలని కోరుకుంటుంది’ అని ఆయన అన్నారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై కంగనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ముంబై పోలీసులను అవమానిస్తూ ఆమె మాట్లాడింది. దాంతో ప్రభుత్వంలో ఉన్నశివసేనకు, కంగనాకు మధ్య తీవ్ర దుమారం నడుస్తోంది. గతవారం ముంబైను పీఓకేతో కంగనా పోల్చింది. దాంతో శివసేన ఎంపి సంజయ్ రౌత్.. కంగనాను ముంబైకు రావొద్దని హెచ్చరించారు. దాంతో కంగనాకు, శివసేనకు మధ్య భారీ వివాదానికి తెరలేచింది.

ఆఫీసును కూల్చడంపై కంగనా బాంబే హైకోర్టును ఆశ్రయించింది. కూల్చివేతలను ఆపివేయాలని కోర్టు బీఎంసీ అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 22కి వాయిదా వేసింది.

For More News..

సెమీ ఫైనల్లో ఓడి.. రికార్డును చేజార్చుకున్న సెరెనా విలియమ్స్

అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన బీజేపీ నేతల అరెస్ట్

రాష్ట్రంలో మరో 2,426 కరోనా కేసులు