కోనరావుపేట,వెలుగు: కోనరావుపేట మండలం కనగర్తి జడ్పీ హైస్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయి కరాటే, కుంగ్ ఫూ పోటీల్లో పతకాలు సాధించినట్లు హెచ్‌ఎం వినోద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 7న వేములవాడలో నిర్వహించిన పోటీల్లో స్కూల్‌కు చెందిన శరణ్య, పల్లవి, వైష్ణవి, రేష్మ, రుచిత, నక్షత్ర, వర్ష, నిత్య, వైష్ణవి, రచన.. కుమిటి విభాగంలో 10 గోల్డ్ మెడల్స్ సాధించినట్లు చెప్పారు.
ప్రస్తుత పరిస్థితుల్లో బాలికలు ఆత్మరక్షణ కోసం తైక్వాండో, కరాటే పోటీలు నేర్చుకోవాలన్నారు. సోమవారం స్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులను అభినందించి సన్మానించారు. కార్యక్రమంలో తైక్వాండో కోచ్ శ్రీనివాస్, టీచర్లు పాల్గొన్నారు.

