
కన్నడ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. యంగ్ యాక్టర్ సంతోష్ బాలరాజ్ (34) కన్నుమూశారు. మంగళవారం (అగస్ట్ 5న ) ఉదయం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
కొన్ని వారాలుగా కాలేయం, కిడ్నీ సమస్యలతో తీవ్రమైన కామెర్లతో బాధపడుతూ సంతోష్ తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. కేవలం 34 ఏళ్ల వయసులోనే నటుడు సంతోష్ మరణించరానే వార్త కన్నడ సినీ పరిశ్రమని, సంతోష్ అభిమానులని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కన్నడ యాక్షన్ చిత్రాలలో.. యాక్షన్ పాత్రలకు సంతోష్ మంచి గుర్తింపు పొందారు.
అయితే, పలు నివేదికల ప్రకారం.. నటుడు సంతోష్ గత నెలలోనే హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారని సమాచారం. మొదట కామెర్లు వ్యాధికి చికిత్స తీసుకోవడం కోసం సంతోష్ ఆసుపత్రిలో చేరారు. అప్పుడు అతని ఆరోగ్యం మెరుగుపడినట్లు కనిపించింది. కానీ పరిస్థితి మళ్లీ క్షీణించడంతో తిరిగి ఆసుపత్రిలో అతను చేరినట్లు నివేదికలు చెబుతున్నాయి. సంతోష్ ఆరోగ్యం క్లిష్టంగా మారి కోమాలోకి వెళ్లడంతో ICUలో చికిత్స తీసుకున్నారు. ఇక రాను రానూ అతని అవయవాలు కూడా సహకరించలేదు. ఈ క్రమంలో మంగళవారం (ఆగస్ట్ 5) ఉదయం సంతోష్ తుది శ్వాస విడిచారు.
Gone Too Soon... #Ganapa Fame #SanthoshBalaraj Passes Away at 34 💔https://t.co/ywpZHgLKpE pic.twitter.com/615apdytaG
— Kannada Movies (@kannada_films) August 5, 2025
సంతోష్ బాలరాజ్ సినిమాలు?
నటుడు సంతోష్ దివంగత కన్నడ చిత్ర నిర్మాత 'అనేకల్ బలరాజ్' కుమారుడే. అతని తండ్రి అనేకల్ నిర్మించిన 'కెంప' (2009) మూవీతో సంతోష్ నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో తన నటనకుగాని మంచి మార్కులు పడ్డాయి. తన కెరీర్లో 'గణప' వంటి యాక్షన్ థ్రిల్లర్ లో నటించి ఫ్యాన్స్ ఫాల్లోవింగ్ పెంచుకున్నారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత సంతోష్ ఎన్నో పవర్‌ఫుల్ రోల్స్ చేశారు.
►ALSO READ | OTT Court Drama: ఓటీటీను ఊపేస్తున్న కోర్టు రూమ్ డ్రామా థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
'కరియా 2', 'బర్‌క్లీ', 'సత్య' వంటి సినిమాలలో అతడు నటించి మంచి గుర్తింపు పొందారు. తేషి వెంకటేష్ దర్శకత్వం వహించిన 2012 రొమాంటిక్ డ్రామా 'ఒలావిన్ ఓలే' మూవీ కూడా మంచి ఆదరణ దక్కించుకుంది. సంతోష్ బాలరాజ్ చివరి చిత్రం 2017 యాక్షన్ గ్యాంగ్‌స్టర్ చిత్రం 'కరియా 2'.