
శరవణన్ ప్రధాన పాత్రలో నటించిన కోర్టు రూమ్ డ్రామా వెబ్ సిరీస్ ‘సట్టముం నీతియుం’.సూర్య ప్రతాప్ షో రన్నర్‌గా బాలాజీ సెల్వరాజ్ డైరెక్ట్ చేసిన ఈ తమిళ సిరీస్.. ఆగస్టు 1నుంచి తెలుగులో స్ట్రీమింగ్‌కి వచ్చింది. ప్రస్తుతం 60 మిలియన్లకి పైగా స్ట్రీమింగ్ మినిట్స్‌తో ఓటీటీలో దూసుకుపోతోంది.
ఉత్కంఠభరితమైన కోర్టు సన్నివేశాలతో పాటు భావోద్వేగంతో కూడిన కథాంశాలు ఉండటంతో ఆడియన్స్ ఎంగేజింగ్గా ఫీల్ అవుతున్నారు. కోర్టులో పేదవారికి న్యాయం జరుగుతుందా? లేదా? ఎటువంటి సమయంలో న్యాయం దూరమవుతుంది? అనే ప్రశ్నలకు సమాధానంగా ఈ మూవీ ఉందంటూ పోస్టులు పెడుతున్నారు.
ఈ సందర్భంగా మంగళవారం (ఆగస్టు 5న) హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. దర్శకుడు బాలాజీ కేవలం 13 రోజుల్లో దీన్ని పూర్తి చేశారు. తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ఈ సిరీస్‌కు తెలుగులోనూ అంతే రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉందని శరవణన్ అన్నాడు.
ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఈ సిరీస్ ఉంటుందని దర్శకుడు బాలాజీ సెల్వరాజ్ చెప్పాడు. శశికళ మాట్లాడుతూ .. ‘నిర్మాతగా ఇలా స్టేజ్ మీద మాట్లాడుతుండటం కొత్తగా ఉంది. యాంకర్‌గా ఎన్నో సార్లు మైక్ పట్టుకున్నా కూడా ఈ రోజు ఇలా కొత్తగా అనిపిస్తోంది. ఇదంతా కూడా నా భర్త ప్రభాకరణ్ వల్లే సాధ్యమైంది. ఈ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్' అని శశికళ చెప్పారు.
Here’s the winning squad behind the nationwide hit #SattamumNeedhiyum!🤩
— Shreyas Media (@shreyasgroup) August 5, 2025
Event By @shreyasgroup ✌️#Saravanan @namritha_mv @balajiselvaraj @soori_prathap @vibinbaskar @RamDasa2 @BhavnaGovardan @mariamila1930 @harihmusiq @srini_selvaraj @Deepak11654042 @balajee3107… pic.twitter.com/TxW9QTpWvN
కథేంటంటే:
ఎలాంటి కేసులనైనా ఈజీగా గెలవగల కెపాసిటీ ఉన్న లాయర్ సుందరమూర్తి (శరవణన్). కానీ.. కేసులు వాదించకుండా కోర్టు బయట నోటరీ పబ్లిక్‌గా పనిచేస్తుంటాడు. చుట్టూ ఉన్నవాళ్లు, చివరికి కుటుంబ సభ్యులు కూడా అతన్ని ఒక ఫెయిల్యూర్ లాయర్‌గా చూస్తుంటారు.అయినా వాటన్నింటినీ మౌనంగా భరిస్తాడు. అప్పటికే సుందరమూర్తి టాలెంట్ గురించి తెలుసుకున్న అరుణ (నమృత) అతని దగ్గర జూనియర్‌గా చేరాలి అనుకుంటుంది.
►ALSO READ | పరదా మూవీ నుంచి థర్డ్ సాంగ్ రిలీజ్..
అప్పుడే కుప్పుసామి (షణ్ముగం) అనే వ్యక్తి తనకు సరైన న్యాయం జరగలేదని కోర్టు ఆవరణలోనే నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. అది చూసిన సుందరమూర్తి కుప్పుసామికి ఎలాగైనా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎన్నో ఏండ్ల తర్వాత మళ్లీ కేసు టేకప్ చేశాడు.
కోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) వేస్తాడు. అప్పుడే అరుణని కూడా జూనియర్‌గా చేర్చుకుంటాడు. సుందరమూర్తి ఈ కేసును ఎలా హ్యాండిల్ చేస్తాడు? కొన్నేళ్లపాటు అతను కేసులకు ఎందుకు దూరంగా ఉన్నాడు. కుప్పుసామి కథేంటి? తెలుసుకోవాలంటే ఈ వెబ్‌సిరీస్ చూడాలి.