పవిత్రకు 54.. దర్శన్ కు 47.. కన్నడ క్రైమ్ కథా చిత్రం

పవిత్రకు 54.. దర్శన్ కు 47.. కన్నడ క్రైమ్ కథా చిత్రం

కన్నడ హీరో దర్శన్ వయస్సు 47 ఏళ్లు.. పవిత్ర గౌడ వయస్సు 54 ఏళ్లు.. వీళ్లిద్దరూ పదేళ్లు సహజీవనం.. పెళ్లి కూడా చేసుకున్నారనే ప్రచారం ఉన్నా అధికారికంగా ఎక్కడా లేదు.. వీళ్లిద్దరి ప్రేమ ఇప్పుడు క్రైం కథా చిత్రంగా మారిపోయింది. ఎంతలా అంటే.. దేశం మొత్తం షాక్ అయ్యే విధంగా... తన ఫ్యాన్స్.. తన అభిమానిని ఓ సినిమా హీరో దర్శన్ హత్య చేయటం వెనక ఏం జరిగింది.. ఎందుకు జరిగింది.. ఎలా జరిగింది అనేది చూద్దాం..

కన్నడ హీరో దర్శన్ కష్టపడి సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు.. హీరో అయ్యాడు. దీంతో కొంత మంది దర్శన్ ఫ్యాన్స్, అభిమాన సంఘాలు పుట్టాయి. కొన్నాళ్లుగా హీరో దర్శన్.. సీరియల్ నటి, మోడల్ అయిన పవిత్ర గౌడ మధ్య రిలేషన్ కొనసాగుతుంది. ఇద్దరూ విహార యాత్రలకు వెళ్లటం.. సినిమా ఫంక్షన్స్ లో కనిపిస్తూ వచ్చారు. దీంతో ఇద్దరి మధ్య లివింగ్ రిలేషన్ ఉన్నట్లు కన్ఫామ్ అయ్యింది. ఈ విషయం తెలిసి హీరో దర్శన్ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. రోజురోజుకు ఇంట్లో గొడవలు వీధికెక్కాయి. దర్శన్, పవిత్ర గౌడ ఫొటోలు, రిలేషన్ పై దర్శన్ భార్య పోలీస్ కంప్లయింట్ కూడా ఇచ్చింది. దీంతో ఇంట్లో రచ్చ పబ్లిక్ అయ్యింది. కొన్నాళ్లుగా దర్శన్, అతని భార్య వేర్వేరుగా ఉంటున్నట్లు సమాచారం. ఇదంతా సినీ ఇండస్ట్రీలో రొటీన్ గా జరిగే వ్యవహారంగా కొంతమంది చూసినా.. ఈ విషయంలో ఫ్యాన్స్ నుంచి వస్తున్న కామెంట్లతో ఇద్దరి ఇగోలు దెబ్బతిన్నాయి. 

ఈ క్రమంలోనే.. పవిత్ర గౌడ తన ఇన్ స్ట్రాలో దర్శన్ తో క్లోజ్ గా ఉన్న ఫొటోలు షేర్ చేస్తూ.. మా రిలేషన్ కు పదేళ్లు.. హ్యాపీ టెన్త్ రిలేషన్ షిప్ యానివర్సీ అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోలపై దర్శన్ వీరాభిమానిగా ఉన్న 33 ఏళ్ల రేణుకా స్వామి అనే యువకుడు.. నెగెటివ్ కామెంట్లు చేయటం మొదలుపెట్టాడు. నీ వల్లే మా దర్శన్ అన్న ఫ్యామిలీలో గొడవలు అంటూ కామెంట్ చేశాడు. పవిత్ర గౌడ క్యారెక్టర్ పై కామెంట్లు చేశాడు.. పవిత్ర గౌడ వల్లే దర్శన్ సినీ కెరీర్ నాశనం అయ్యిందని.. నీ వల్లే దర్శన్ అన్న జీవితంలో గొడవలు వచ్చాయి అంటూ వ్యక్తిగతంగా కామెంట్లు చేయటం మొదలుపెట్టాడు. ఇది కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది. 

ఇక్కడే పవిత్ర గౌడ ఇగో దెబ్బతిన్నది. రేణుకాస్వామిని ఏమైనా చేస్తావా లేదా అంటూ హీరో దర్శన్ పై ఒత్తిడి తీసుకొచ్చింది పవిత్ర గౌడ . రేణుకా స్వామిని కొట్టాలని.. కిడ్నాప్ చేసి బెదిరించాలని.. వాడిని చంపేయాలంటూ పవిత్ర గౌడ తన పగ, ప్రతీకారాన్ని దర్శన్ పై రుద్దింది.. పదేళ్లుగా పీకల్లోతు ప్రేమలో ఉన్న దర్శన్.. లవర్ పవిత్ర గౌడ కోరికను మన్నించాడు.. లవర్ కోరికను తీర్చాలనే ఉద్దేశంతో.. ముందూ వెనకా ఆలోచించకుండా.. 30 లక్షల రూపాయల సుపారీ ఇచ్చి.. తన ఫ్యాన్స్ సంఘంలోని సభ్యులతోనే.. రేణుకా స్వామిని కిడ్నాప్ చేసి చంపించాడు. అసలు కథ ఇదీ.. 

ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. పవిత్ర గౌడ వయస్సు 54 ఏళ్లు.. ఆమెకు 18 ఏళ్లకే పెళ్లయ్యింది. ఇప్పుడు పెళ్లీడుకొచ్చిన కుమార్తె ఉంది.  ఇక హీరో దర్శన్ వయస్సు 47 ఏళ్లు.. 15 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. 53 ఏళ్ల పవిత్ర గౌడ ప్రేమలో.. 47 ఏళ్ల హీరో దర్శన్... పదేళ్లుగా సహజీవనంలో ఉన్నారు.. ఇది వాళ్ల వ్యక్తిగత జీవితం అయినా.. అతని అభిమాని రేణుకా స్వామి మాత్రం దాన్ని పర్సనల్ గా.. తన సమస్యగా తీసుకోవటం వల్లే సమస్య వచ్చింది. హత్య అనేది ఎంత పెద్ద నేరమో.. దాని వల్ల ఎదురయ్యే పర్యావసానాలు ఎలా ఉంటాయో కూడా ఊహించకుండా.. ముందూ వెనకా చూడకుండా.. ప్రేయసి కోరిందని.. తన సొంత అభిమానిని హత్య చేయించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 

సెలబ్రిటీ అయినంత మాత్రాన ఒకటి వ్యక్తిగత జీవితంపై కామెంట్లు చేయటం ఏంటనే వాదన ఒక వైపు ఉన్నా.. హీరో దర్శన్ సహ జీవినంపై మరికొందరు నెగెటివ్ కామెంట్లు చేసినా.. అది చట్టరీత్యా నేరం కాకపోయినా.. ఈ విషయంలో మాత్రం దర్శన్ క్రైం కథా చిత్రం ఊహించని విధంగా ఉండటమే విశేషం..