War 2: వార్ 2లో మరో సౌత్ స్టార్.. ఇక ఈ సినిమాను ఆపడం కష్టమే

War 2: వార్ 2లో మరో సౌత్ స్టార్.. ఇక ఈ సినిమాను ఆపడం కష్టమే

ప్రస్తుత ఇండియన్ నుండి రానున్న మోస్ట్ వాంటెడ్ సినిమాలలో వార్ 2 ఒకటి. బాలీవుడ్ స్టార్ హ్రితిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ఈ భారీ మల్టీ స్టారర్ సినిమాను దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. అందుకే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాసెట్స్ లో ఈ మధ్యే ఎంట్రీ ఇచ్చాడు ఎన్టీఆర్. అప్పటినుండి ఈ సినిమా అప్డేట్స్ కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

ఇక తాజాగా వార్ 2 గురించి మరో క్రేజీ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే.. ఈ సినిమా మరో సౌత్ స్టార్ నటించనున్నాడట. ఆ స్టార్ మరెవరో కాదు కన్నడ యాక్షన్ హీరో ధృవ సర్జ. అవును.. ధృవ సర్జ కన్నడ ఇండస్ట్రీలో యాక్షన్ సినిమాలకు కేరాఫ్. అందుకే ఈ సినిమాలో ఒక కీ రోల్ కోసం ధృవ సర్జను అప్ప్రోచ్ అయ్యారట మేకర్స్. ఇక ధృవ సర్జ కూడా వేరే ఆలోచన లేకుండా వెంటనే ఒకే చెప్పేశాడట. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుందంట. అంతేకాదు.. ఈ పాత్రకు సంబందించిన షూట్ కేసుల త్వరలోనే మొదలుకానుందని సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read:తిరుమ‌ల శ్రీవారి సేవలో హీరో విశ్వ‌క్ సేన్.. ఫొటోస్ వైరల్ 

ఇక వార్ 2 సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. యాష్ రాజ్ ఫిలిమ్స్ ఈ సినిమా కోసం  భారీగా ఖర్చు చేయనున్నారని అంచనా. ఇక హ్రితిక్ రోషన్, ఎన్టీఆర్ ఇద్దరు బెస్ట్ డాన్సర్స్ కావడంతో నాటు.. నాటు తరహాలో ఒక మాస్ సాంగ్ సెట్ చేస్తున్నారట. ఈ పాటలో ఇద్దరి డాన్స్ ఆడియన్స్ కు ఫీస్ట్ లా ఉంటుందని టాక్. మరి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఏ రేంజ్ హిట్ గా నిలుస్తుందో చూడాలి.