కన్నప్ప రేంజ్ పెంచేస్తున్న మంచు విష్ణు.. రంగంలోకి మరో సూపర్ స్టార్

కన్నప్ప రేంజ్ పెంచేస్తున్న మంచు విష్ణు..  రంగంలోకి మరో సూపర్ స్టార్

మంచు విష్ణు(Manchu vishnu) టైటిల్ రోల్ లో కనిపించనున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు కన్నప్ప(Kannappa). భారీ బడ్జెట్ తో, పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్(Mukhesh kumar singh) దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే అధికారికంగా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. 

అనౌన్స్మెంట్ తోనే హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లేందుకు స్టార్ క్యాస్ట్ ను సిద్ధం చేస్తున్నారు మంచు విష్ణు. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు తో ఎలాగైనా హిట్టు కొట్టాలని కంకణం కట్టుకున్నాడు మంచు విష్ణు. అందుకే ఈ సినిమాలో ప్రభాస్ శివుడిగా నటిస్తున్నారన్న విషయాన్ని చెప్పి అంచనాలు పెంచేశాడు. అంతేకాదు నయనతార పార్వతిగా నటిస్తోంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్. 

ఇక తాజాగా ఈ సినిమా కోసం మరో స్టార్ హీరోను దించే పనిలో పడ్డారట విష్ణు. ఆ స్టార్ హీరో మరెవరో కాదు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్. కన్నప్పలో ఒక కీలక మైన పాత్ర కోసం శివరాజ్ కుమార్ ను తీసుకున్నారట. అయితే ఆయన ఏ పాత్రలో కనిపించనున్నారు అనేదానిపై మాత్రం క్లారిటీ లేదు.

ALSO READ : సిటీకి శత్రువు మీరే : కార్పోరేషన్ కు హైకోర్టు చురకలు