మరో పీరియాడిక్ మూవీ షురూ 

మరో పీరియాడిక్ మూవీ షురూ 

మలయాళ నటుడే అయినా టాలీవుడ్‌‌‌‌‌‌‌‌లోనూ స్టార్ ఇమేజ్ దక్కించుకున్నాడు  దుల్కర్ సల్మాన్. మహానటి,  సీతారామం లాంటి పీరియాడిక్ మూవీస్‌‌‌‌‌‌‌‌తో తెలుగులో సూపర్ హిట్స్ అందుకున్న దుల్కర్.. ప్రస్తుతం ‘లక్కీ భాస్కర్’ సినిమా చేస్తున్నాడు.  ఇది నైంటీస్‌‌‌‌‌‌‌‌ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్ సినిమా.  అలాగే తన నెక్స్ట్ తెలుగు సినిమా కూడా పీరియడిక్ మూవీ కావడం విశేషం. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘కాంత’ టైటిల్‌‌‌‌‌‌‌‌ను  ఫిక్స్ చేశారు.  రానా దగ్గుబాటి,  దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని రామానాయుడు స్టూడియోలో  సోమవారం పూజా కార్యక్రమాలతో  ఈ చిత్రాన్ని  ప్రారంభించారు.  

హీరో వెంకటేష్  మూహూర్తపు షాట్‌‌‌‌‌‌‌‌కు క్లాప్  కొట్టారు. 1950 మద్రాస్‌‌‌‌‌‌‌‌ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో మానవ సంబంధాలు,  సామాజిక మార్పుల నేపథ్యంలో ఈ సినిమాని రూపొందిస్తున్నట్టు తెలియజేశారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది. సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్నారు. జాను సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ,  మలయాళ భాషలలో సినిమా విడుదల కానుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తామని మేకర్స్ చెప్పారు.