Kantara Chapter1: ‘కాంతార గ్లింప్స్‌’రిలీజ్.. అంచనాలు పెంచిన రిషబ్ శెట్టి మాటలు

Kantara Chapter1: ‘కాంతార గ్లింప్స్‌’రిలీజ్.. అంచనాలు పెంచిన రిషబ్ శెట్టి మాటలు

రిషబ్ శెట్టి నటిస్తూ, డైరెక్ట్ చేస్తున్న కాంతారా నుండి బిగ్ అప్డేట్ వచ్చింది. నేడు (జులై21న) ‘కాంతార జర్నీ’ అంటూ గ్లింప్స్‌ రిలీజ్ చేశారు మేకర్స్. ఇది కేవలం ఒక సినిమా కాదు.. ఒక శక్తి అంటూ రిషభ్‌ తన మాటల్లో జర్నీని వివరించారు. 250రోజులు దీన్ని చిత్రీకరించినట్లు తెలిపారు.

' నాదొక కల.. మన మట్టి కథను మొత్తం ప్రపంచానికి చెప్పాలనే.! మన ఊరు, మన జనం, మన నమ్మకాలూ. నేను ఈ కథను చెప్పడానికి ముందుకెళ్లినప్పుడు వేల మంది నా వెంట వచ్చారు. మూడేళ్ల కఠోర శ్రమ.. 250రోజుల చిత్రీకరణ.. ఎంత కష్టమొచ్చినా నేను నమ్ముకున్నా దైవం నా చెయ్యి వదల్లేదు. మా మొత్తం బృందం, మా నిర్మాత మా వెన్నంటే ఉన్నారు. ప్రతిరోజు వేలమంది సెట్లో ఉన్నప్పుడు నన్ను వెంటాడుతున్న విషయం ఒక్కటే.. ఇది కేవలం సినిమా కాదు. ఇదొక శక్తి. ' అని రిషబ్ తన మాటల్లో కాంతారా జర్నీ చెప్పుకొచ్చారు.

ALSO READ : Ram Charan: రామ్ చరణ్ బీస్ట్ మోడ్ ఆన్.. చెమటలు చిందిస్తున్న పెద్ది ఫోటో వైరల్

ఈ చిత్రాన్ని "మన సంస్కృతిలో లోతుగా పాతుకుపోయిన, అచంచలమైన అంకితభావం, అవిశ్రాంత కృషి మరియు అద్భుతమైన జట్టు స్ఫూర్తితో ప్రాణం పోసుకున్న దైవిక ప్రయాణం"గా అభివర్ణిస్తూ చెప్పిన రిషబ్ మాటలు సినిమాపై గట్టి నమ్మకం కలిగేలా చేసింది. ఇకపోతే, హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ మూవీ అక్టోబర్ 2 ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.