Ram Charan: రామ్ చరణ్ బీస్ట్ మోడ్ ఆన్.. చెమటలు చిందిస్తున్న పెద్ది ఫోటో వైరల్

Ram Charan: రామ్ చరణ్ బీస్ట్ మోడ్ ఆన్.. చెమటలు చిందిస్తున్న పెద్ది ఫోటో వైరల్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన కొత్త లుక్లో దర్శనిమిచ్చాడు. లేటెస్ట్గా తన X ఖాతాలో బిస్ట్ మోడ్ పిక్ షేర్ చేశాడు. పెద్ది కోసం తన మేకోవర్ పూర్తిగా మార్చుకున్న చరణ్.. కండలు తిరిగిన దేహంతో కనిపిస్తున్నాడు. జిమ్ లో వర్కౌట్ చేస్తూ, చెమటలు కక్కుతున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇపుడీ ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 

ఈ ఫొటోకు చరణ్ తనదైన శైలిలో క్యాప్షన్ ఇచ్చి మరింత హైప్ పెంచాడు. ‘‘పెద్ది కోసం మారే ప్రక్రియ మొదలైంది. స్వచ్ఛమైన ధైర్యం. నిజమైన ఆనందం’’అని క్యాప్షన్ ఇచ్చారు చరణ్. ఇపుడీ ఫొటోకు మెగా ఫ్యాన్స్ లైక్ ల మీద లైక్ లు కొడుతూ ఇంటర్నెట్ లో హల్ చెల్ చేస్తున్నారు. మీ కష్టం వెయ్యింతల విజయంతో ముందుంటుంది అన్న అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ప్రస్తుతం 'పెద్ది' మూవీ వరుస షూటింగ్ షెడ్యూల్స్ తో బిజీగా ఉంది. ఇదొక రూరల్ స్పోర్ట్స్ డ్రామా ఫిల్మ్. అయితే, ఈ మూవీ కేవలం ఒక క్రికెట్, స్పోర్ట్స్ డ్రామాకు మించి ఉంటుందని మేకర్స్ ఇప్పటికే స్పష్టం చేశారు. టైటిల్ గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచీ, ఈ సినిమా అంచనాలు అంతకంత పెరిగాయి. విస్తృతమైన కథా పరిధిని కలిగి ఉన్న ఈ చిత్రం, వెండితెరపై చూడటానికి విందుగా ఉండబోతుంది.

ALSO READ : ‘అఖండ 2’లో బాలయ్యతో సంయుక్త మీనన్ స్పెషల్‌‌ సాంగ్..

ఇకపోతే.. ఈ సినిమాను వెంకట సతీష్ కిలారు వృధ్ధి సినిమాస్ బ్యానర్‌పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నాయి. ఈ భారీ కలయిక సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచుతోంది. 2026 మార్చి 27న, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా పెద్ది ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.