
బింబిసార, విరూపాక్ష, డెవిల్ లాంటి చిత్రాలతో తెలుగులోనూ మంచి గుర్తింపును అందుకున్న మలయాళ హీరోయిన్ సంయుక్త మీనన్.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఆమె నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ‘అఖండ 2’. ఇందులో ఆమె కీలక పాత్ర పోషించడంతో పాటు ఓ స్పెషల్ సాంగ్ కూడా చేయనుందని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ సాంగ్ షూట్ చేయనున్నారని న్యూస్ వైరల్ అవుతోంది. దీనిపై టీమ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. బోయపాటి శ్రీను రూపొందిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో నాలుగేళ్ల తర్వాత ‘అఖండ’కు సీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్రమిది. ఇప్పటికే హైదరాబాద్, కుంభమేళా, హిమాలయాలతోపాటు జార్జియాలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఆది పినిశెట్టి మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. దసరా కానుకగా సెప్టెంబర్ 25న సినిమా విడుదల కానుంది.