Viral Video : కెనడాలో కపిల్ శర్మ కెఫేపై కాల్పులు.. ఉగ్రవాద సంస్థ హస్తం?

Viral Video : కెనడాలో కపిల్ శర్మ కెఫేపై కాల్పులు..  ఉగ్రవాద సంస్థ హస్తం?

Kapil Sharma : ప్రముఖ భారతీయ హాస్యనటుడు,  నటుడు కపిల్ శర్మ ( Kapil Sharma ) ఇటీవల కెనడాలోని సర్రేలో 'క్యాప్స్ కెఫే' (Kap’s Cafe) పేరుతో ఒక రెస్టారెంట్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, జూలై 9, 2025న ఈ కెఫేలో ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, అందులో కొందరు వ్యక్తులు కెఫేపైకి తుపాకీతో కాల్పులు జరుపుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ఘటనలో ఏవరికీ గాయాలు కాలేదు.   జర్నలిస్ట్ రితేష్ లఖి ఈ వీడియోను ఎక్స్ లో షేర్ చేశారు.

ఉగ్రవాద సంస్థ హస్తం?
జర్నలిస్ట్ రితేష్ లఖి తన ట్వీట్‌లో, "ప్రపంచ ప్రఖ్యాత హాస్యనటుడు కపిల్ శర్మ కొత్తగా ప్రారంభించిన రెస్టారెంట్ 'క్యాప్స్ కెఫే'పై నిన్న రాత్రి కెనడాలోని సర్రే, బీసీలో కాల్పులు జరిగాయి. బీకేఐ (బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్) కార్యకర్త, ఎన్‌ఐఏ (India)కు అత్యంత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన హర్జీత్ సింగ్ లడ్డీ,  కపిల్ చేసిన కొన్ని వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఈ కాల్పులకు పాల్పడినట్లు ప్రకటించాడు" అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ కాల్పుల వెనుక ఉగ్రవాద సంస్థ హస్తం ఉందనే ఆరోపణలకు దారితీసింది.

 

నెటిజన్ల ఆందోళన
కపిల్ శర్మ కెఫేపై జరిగిన కాల్పుల ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. అనేక మంది నెటిజన్లు దీనిపై తీవ్రంగా స్పందించారు. ఒక నెటిజన్, "ఇది చాలా భయంకరమైనది.. బిష్ణోయ్ లింకులు ఉన్నాయా?" అని ట్వీట్ చేయగా, మరొక ఎక్స్ యూజర్, "ఈ ఖలిస్తానీ వెధవలు ప్రపంచం మొత్తాన్ని అసురక్షితంగా మార్చారు, కెనడాను కూడా. కపిల్ శర్మ, సిద్ధూ మూసేవాలా అందరూ జాట్ టెర్రరిజం బాధితులే. పంజాబ్ ఎలాంటి వెధవలను ఉత్పత్తి చేస్తుందో ముఖ్యంగా యూనివర్సిటీ రాజకీయాల నుంచి ఆలోచించాలి. #KhalistanMurdabad #KKMKB #Drugs" అని రాశారు.

ఈ సంఘటన కెనడాలో భారతీయుల భద్రతపై ఆందోళనలను పెంచింది. ముఖ్యంగా సెలబ్రిటీల వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకోవడం మరింత భయాందోళనలను సృష్టిస్తోంది. ఈ కాల్పుల వెనుక ఉన్న పూర్తి వివరాలు, హర్జీత్ సింగ్ లడ్డీ ఆరోపణల వెనుక వాస్తవాలు ఏంటి అనే దానిపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనపై కెనడియన్ పోలీసులు ఎలా స్పందిస్తారో, కపిల్ శర్మ దీనిపై అధికారికంగా ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.