నాకు ప్రాణహాని ఉంది.. కారు టైర్స్ కోసేశారు.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్

నాకు ప్రాణహాని ఉంది.. కారు టైర్స్ కోసేశారు.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్

తనకు ప్రాణహాని ఉందంటూ సంచలన కామెంట్స్ చేసింది నటి కరాటే కళ్యాణి(Karate Kalyani). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. "సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం గురించి మాట్లాడిన తరువాత చాలా మందికి నాపై కోపం ఉంది. ఇటీవల నా కొత్త కారులో ఓ ప్రోగ్రాంకి వెళ్లి వస్తుంటే కారు టైర్స్ పేలిపోయాయి. హైవే మీద అయితే కారు పల్టీ కొట్టేది. కారు ఒక సైడ్ టైర్స్ ను ఎవరో కోసేశారు. దాని వల్ల కారు ఎగిరే అవకాశం ఉంది. మెకానిక్ కి చూపిస్తే ఇవి కావాలని కోసినట్టే ఉందని అన్నాడు. నా మీద ఉన్న కోపంతోనే కారును అలా చేశారు. ఒకవేళ కార్ ఫాస్ట్ గా వెళ్లి ఏమన్నా జరిగి ఉంటే ఏంటి పరిస్థితి అంటూ సంచలన కామెంట్స్ చేసింది. అయితే ఇది ఎవరు చేశారు అనేదానికి మాత్రం సమాధానంలేదు.

ఇక ఖమ్మంలో చేప్పట్టిన కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్(NTR) విగ్రహా ఏర్పాటును కరాటే కళ్యాణి అడ్డుకున్న సంగతి తెలిసిందే. కోర్టులు, కేసులు అంటూ మొత్తానికి ఆ విగ్రహావిష్కరణ ఆగిపోయేలా చేసింది. దీంతో ఆమెను ‘మా'(Maa) నుంచి కూడా తొలగించారు. దీనిపై కూడా న్యాయపోరాటానికి సిద్ధమైంది కరాటే కళ్యాణి.