లక్షల్లో హ్యాండ్ బ్యాగు ఖర్చులు..ఎందుకో తెలుసా?

లక్షల్లో హ్యాండ్ బ్యాగు ఖర్చులు..ఎందుకో తెలుసా?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఏం చేసినా ఇట్టే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లేటెస్ట్గా బాలీవుడ్ స్టార్ కరీనా కపూర్(Kareena Kapoor) మైంటైన్ చేసే హ్యాండ్ బ్యాగు గురుంచి పెద్ద డిస్కషన్ జరుగుతుంది. ఎప్పుడు డిఫరెంట్ కలర్ హ్యాండ్ బ్యాగుతో కనిపించే కరీనా..ఇందుకోసం కోట్లలో అమౌంట్ ఖర్చు చేస్తుందని టాక్. ఈ స్టైలిష్ హ్యాండ్ బ్యాగులను ఇటలీ,ఫ్రాన్స్, కెనడా నుంచి స్ట్రాంగ్ లెదర్ బ్యాగులను తెప్పించుకుంటుందని సమాచారం.

ఈ హ్యాండ్ బ్యాగ్స్ రేట్స్..రూ.5లక్షల నుంచి,కోటి రూపాయల వరికి ఉంటుందని..ఇప్పటికే కరీనా కపూర్ వద్ద చాలా డిఫెరెంట్ టైప్స్ అఫ్ బ్యాగ్స్ ఉన్నాయని తెలుస్తోంది. ఇక తన దగ్గర రూ.కోట్ల విలువ చేసే హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయని సమాచారం.

ఈ లేటెస్ట్ ఫ్యాషన్ వరల్డ్లో కరీనా హ్యాండ్ బాగ్స్ విషయంలో చాలా డిఫరెంట్గా ఉంటుందని అర్ధం అవుతుంది. బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్గా కరీనా కపూర్కి పేరు కూడా ఉంది. ఈ విషయంలో కరీనా ఒక్కరినే కాదు, బాలీవుడ్లోని చాలా వరకు హీరోయిన్స్ హ్యాండ్ బ్యాగు ఖర్చు విషయంలో వెనుకాడరని టాక్. 

ఏదేమైనా ఈ ఫ్యాషన్ జనరేషన్ లో.. ఒక్క బ్యాగ్ విషయంలోనే కాకుండా..అన్నిటిలోను ట్రెండ్ను సెట్ చేసే లేడీస్ ఉన్నారని తెలుస్తోంది. సాధారణమైన లేడీస్ నుంచి హై క్లాస్ లేడీస్ వరకు మ్యాచింగ్ డ్రెస్సెస్ తో పాటు, మ్యాచింగ్ బ్యాంగిల్స్, హ్యాండ్ బ్యాగ్స్, సెట్ అయ్యేలా ఫాలో అవుతారు.