ఆ క్షణం నాకెంతో బాధేసింది : కరీనా కపూర్

ఆ క్షణం నాకెంతో బాధేసింది : కరీనా కపూర్

బాలీవుడ్ సూపర్ స్టార్ అమిర్ ఖాన్(Amirkhan) గత చిత్రం లాల్ సింగ్ చడ్డా(Lalsinghchaddha). మెగాస్టార్ చిరంజీవి సమర్పణ (తెలుగు)లో వైయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్, అమిర్ ఖాన్ ప్రొడ‌క్షన్స్ పతకంపై ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీలో అమీర్ ఖాన్ తో పాటు కరీనా కపూర్ (Kareenakapoor), అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya)  నటించారు. లాల్ సింగ్ చ‌డ్డా మూవీ బాక్సాపీస్ వద్ద ఆశించిన ఫ‌లితం సాధించలేదు. ఆ సినిమా ప్లాప్ త‌ర్వాత అమీర్ ఖాన్ నుంచి మరో సినిమా రాలేదు.

హీరోయిన్ కరీనాకపూర్.. అమీర్ ఖాన్ ఇండ‌స్ట్రీలో వీరిద్ద‌రు మంచి స్నేహితులు. వీరి కాంబోలో వచ్చిన 3 ఇడియ‌ట్స్..త‌లాష్ వంటి చిత్రాలు భారీ విజయం అందుకున్నాయి. ఇదే క‌ల‌యిక‌లో తెర‌కెక్కిన లాల్ సింగ్ చ‌డ్డా  మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. 

క‌రీనాక‌పూర్ ఈ సినిమా వైఫ‌ల్యం గురించి తాజా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..లాల్ సింగ్ చ‌డ్డా మూవీ..ప్లాప్ త‌ర్వాత అమీర్ని ఓ ఈవెంట్లో క‌లిసాను. ఆ ఫంక్షన్లో అమీర్ చాలా డిస్సప్పాయింట్గా కనిపించారు. న‌న్ను న‌మ్మి ఈ సినిమా చేసినందుకు గానూ.. నీ జీవితంలో ఫెయిల్యూర్ ఇవ్వాల్సి వచ్చింది. అందుకు క్ష‌మాప‌ణ‌లు.. అని అమీర్ అనడంతో..ఆ క్ష‌ణంలో నాకెంతో బాధ‌గా అనిపించింది. నేను ఇంటికి వెళ్ళాక.. అమీర్ కు మెస్సేజ్ పెట్టాను.

లాల్ సింగ్ చడ్డా టీం అంతా కలిసి.. ఒక బ్యూటిఫుల్ సినిమాని తెరకెక్కించాం. మన ప్రయత్నంలో ఎటువంటి లోపం లేదు.అందుకు ఒడిపోయిన‌ట్లు భావించి..ఎప్పుడు బాధ‌ప‌డ‌కు.. ఈ ఒక్క సినిమా రిసల్ట్తో..మన ఫ్రెండ్షిప్ ఆధార‌ప‌డ‌దు అంటూ.. సందేశం పంపినట్లు కరీనా కపూర్ తెలిపారు. 

రీసెంట్ గా దళపతి విజయ్..నెల్స‌న్ దిలీప్ కుమార్ తో కాంబోలో వచ్చిన బీస్ట్ మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో..నెల్సన్ బాధ‌ని చూసిన విజ‌య్  రియాక్ట్ అయ్యారు. మ‌న స్నేహం సినిమా రిసల్ట్ తో..సంబంధం లేనిది..ఫ్యూచర్ లో మ‌రో మంచి మూవీ చేద్దాం' అని ఓదార్చారు.