గల్ఫ్ లో నరకయాతన : వీడియోతో మరో బాధితుడి గోస

గల్ఫ్ లో నరకయాతన : వీడియోతో మరో బాధితుడి గోస

గల్ఫ్ లో నరకయాతన పడుతున్నానంటూ మరో బాధితుడు సెల్ఫీ వీడియోలో తన  కష్టాలను వివరించాడు. మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కరీంనగర్ జిల్లా మేడిపల్లి మండలం వల్లంపెల్లికి చెందిన ఎల్లా కృష్ణ సౌదీలోని గ్రీన్ హౌస్ కంపెనీలో పనిచేసేందుకు కొన్ని రోజుల కిందట  అక్కడి వెళ్లాడు. లీలావతి, గడ్డం జీవన్ రెడ్డి తన దగ్గర  లక్ష రూపాయులు తీసుకున్నట్లు చెప్పాడు. గల్ఫ్ కు వెళ్ళాక అరబ్బు షేక్ ఎడారిలో గొర్రెల కాపారిగా ఉంచాడన్నాడు ఎల్లా కృష్ణ. తాగేందుకు నీళ్లు కూడా లేవంటున్నాడు. ఏదైనా అవసరమైతే ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందని చెప్పాడు.